Breaking News

పునర్వినియోగ రాకెట్‌ రూమీ–1

Published on Sun, 08/25/2024 - 09:08

చెన్నై: పునర్వినియోగ హైబ్రిడ్‌ రాకెట్‌ రూమీ–1ను భారత్‌ మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. 80 కిలోల ఈ రాకెట్‌ తమళినాడులోని చెన్నై తీరం నుంచి శనివారం ఉదయం హైడ్రాలిక్‌ మొబైల్‌ కంటైనర్‌ లాంచ్‌ప్యాడ్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అతి తక్కువ బరువున్న మూడు క్యూబ్‌ ఉపగ్రహాలు, 50 పికో ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లింది. 

వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు, ఓజోన్‌ పొరలో మార్పులు, గ్లోబల్‌ వారి్మంగ్‌ వంటి అంశాలపై ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేస్తాయి. భూమిపైకి విలువైన సమాచారం చేరవేస్తాయి. తమిళనాడులోని స్పేస్‌జోన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ మారి్టన్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌తో కలిసి రూమీ–1 రాకెట్‌ను అభివృద్ధి చేసింది. మిషన్‌ రూమీ–2024 విజయవంతం కావడం వెనుక ఆయా సంస్థ కృషి ఉంది. ఈ ప్రయోగంలో 1,500 మంది పాఠశాల విద్యార్థులు సైతం పాలుపంచుకున్నారు. 

రూమీ–1 రాకెట్‌ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, ఉపగ్రహాలను ఉపకక్ష్య ప్రాంతంలో విడిచిపెట్టిందని స్పేస్‌జోన్‌ ప్రతినిధులు చెప్పారు. సాధారణంగా ఉపగ్రహ ప్రయోగం పూర్తయిన తర్వాత రాకెట్‌ వాతావరణంలో మండిపోవడమో లేక సముద్రంలో కూలిపోవడమో జరుగుతుంది. కానీ, పారాచూట్ల సాయంతో రాకెట్‌ను భూమికి చేర్చి, మళ్లీ వినియోగి ంచుకోవడం పునర్వినియోగ హైబ్రిడ్‌ రాకెట్‌ ప్రత్యేకత. రాకెట్‌ ప్రయోగాల ఖ ర్చును తగ్గించాలన్న లక్ష్యంతో పునర్వినియోగ హైబ్రిడ్‌ రాకెట్‌ను తయారు చేసినట్లు స్పేస్‌జోన్‌ కంపెనీ వెల్లడించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)