Breaking News

పెరుగుతున్న మరణాలు

Published on Thu, 05/20/2021 - 05:48

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది.  బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,67,334 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3 లక్షలలోపు కేసులు రావడం వరసగా ఇది మూడోరోజు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,96,330కు పెరిగింది. 3,89,851 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,529 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 2,83,248కు పెరిగింది.  మరోవైపు దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 3,89,851 కరోనా రోగులు కోలుకున్నారు.

దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,19,86,363కు పెరిగింది. రికవరీ రేటు 86.23 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,26,719కు చేరింది. మొత్తం యాక్టివ్‌ కేసులో 69.02 శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 32,03,01,177 కరోనా పరీక్షలు నిర్వహించగా గత 24 గంటల్లో 20,08,296 పరీక్షలు చేపట్టారు. ఇది అంతర్జాతీయ రికార్డు. భారత్‌లో ఒకే రోజు ఇంత ఎక్కువ కరోనా టెస్ట్‌లు చేయడం ఇదే తొలిసారి. గత వారంతో పోలిస్తే భారత్‌లో 13 శాతం తక్కువగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే  రోజూ రెండు లక్షలకు మించి కొత్త కేసులతో ప్రపంచంలోనే అత్యధిక కొత్త కేసులు నమోదవుతున్న దేశంగా భారత్‌ తొలిస్థానంలో ఉందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)