Breaking News

Onions: ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

Published on Thu, 02/22/2024 - 19:56

ఢిల్లీ: దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని సడలించింది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్‌, బెహ్రెయిన్‌, భూటాన్‌లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌ ప్రకటన విడుదల చేశారు.

బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రెయిన్‌కు 3 వేల టన్నులు, భూటాన్‌కు 560 టన్నుల చొప్పున ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.. కానీ మార్చి 31 వరకు మాత్రమే నిర్దేశించిన విధంగా ఉల్లిని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఉందని, దీనికి సంబంధించిన విధివిధానాల్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

కాగా, దేశంలో ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించి దేశీయంగా సరఫరా పెంచేందుకు కేంద్రం గతేడాది డిసెంబర్‌ 8న ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ చేసిన సూచన మేరకు తాజాగా నాలుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి?

#

Tags : 1

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు