Breaking News

దేశంలోనే తొలిసారిగా హైడ్రో నావ!

Published on Fri, 12/12/2025 - 06:27

వారాణసి: స్వచ్ఛ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత్‌ మరో కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా  హైడ్రోజన్‌ సాయంతో వాణిజ్యపరమైన నా వికా సేవలకు తెర తీసింది. వారణాసిలోని నమో ఘాట్‌ ఇందుకు వేదికైంది. హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ నావను కేంద్ర జల వనరులు, నౌకాయాన మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ గురువారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయేతర, దీర్ఘకాలిక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 

‘మన మిప్పుడు హైడ్రో ఇంధనాన్ని వాడుతున్న చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్‌ వంటి అతి కొద్ది దేశాల సరసన సగర్వంగా నిలిచాం. ఇది కేవలం సాంకేతిక ప్రగతి మా త్రమే కాదు. స్వచ్ఛ ఇంధనం, దాని వాడకం నిమిత్తం దేశీయ మార్గాల రూపకల్పన దిశగా మనం వడివడిగా వేస్తున్న ముందడుగు తిరుగులేని సూచిక. అంతర్గత జల మార్గాలు దేశాభివృద్ధిలో కీ పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతున్నాయి. జాతీయ జల మార్గాల సంఖ్య గడచిన పదేళ్లలో సంఖ్య 5 నుంచి ఏకంగా 111కు పెరిగింది! వాటిలో 13 జల మార్గాల్లో పర్యాటకం నానాటికీ ఇతోధికంగా పెరిగిపోతోంది. ఇదెంతో శుభసూచకం. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ వల్లే ఇది సాధ్యపడింది‘ అన్నారు. హైడ్రో ఇంధన సేవలను పూర్తిస్థాయిలో వినియోగించాలంటే మరిన్ని పరిశోధనలు, కీలక పరీక్షలు చేయాల్సి ఉంది. 
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)