Breaking News

'భారత్‌' వన్యమృగాల గమ్యస్థానం

Published on Sat, 12/20/2025 - 04:22

ప్రపంచవ్యాప్తంగా వేలాది వన్యప్రాణులు ఇటీవలి సంవత్సరాలలో ఇండియాలోని వివిధ జంతు ప్రదర్శనశాలలకు చేరుకున్నాయి. ఆ జాబితాలో పులులు, సింహాల వంటి క్రూరమృగాలే కాకుండా పక్షులు, కోతి జాతుల వంటివీ ఉన్నాయి. 2023, 2024లలో ప్రపంచంలో అత్యధిక వన్యమృగాలు దిగుమతి చేసుకున్న దేశం మనదే. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

2024లో ప్రపంచవ్యాప్తంగా 2,922 వన్యమృగాలు వివిధ దేశాలలోని ‘జూ’లకు చేరుకున్నాయి. వాటిలో 1,640 ఇండియా దిగుమతి చేసుకున్నవే. ఆ ఏడాది, అంతకుముందు ఏడాది కూడా (మొత్తం 4,051 వన్యమృగాలు) ఇండియానే అతిపెద్ద  దిగుమతి­దారుగా ఉంది. 2022లో రెండో స్థానంలో, 2021లో నాలుగో స్థానంలో ఉంది. 

వన్యమృగాల దిగుమతుల్లో ప్రముఖ దేశాలుగా ర్యాంకులు పొందిన సింగపూర్, యూఏ­ఈల నుంచి కూడా ఇండియా దిగుమతి చేసుకోవటం విశేషం. కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎండేజర్డ్‌ స్పీషీస్‌ (సి.ఐ.టి.ఇ.ఎస్‌.) నివేదిక ప్రకారం 1978 నుంచి ఇండియాలోని ‘జూ’లకు చేరుకున్న వన్యప్రాణులలో 90 శాతం గత నాలుగేళ్లలో దిగుమతి అయినవే.   

దక్షిణాఫ్రికా నుంచే అధికం
1978 నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న వన్యమృగాలలో దాదాపు 30 శాతం దక్షిణాఫ్రికాకు చెందినవే. ఐరోపా దేశాల నుంచీ దిగుమతులు అధికంగానే ఉన్నాయి. 

పులులకే డిమాండ్‌ ఎక్కువ
ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం మనదే. గత 46 ఏళ్లలో మనదేశం 314 పులులను దిగుమతి చేసుకుంది. తర్వాతి స్థానాలలో సింహాలు, చీతాలు ఉన్నాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)