Breaking News

నేడు మణిపూర్‌కు ‘ఇండియా’

Published on Sat, 07/29/2023 - 05:42

న్యూఢిల్లీ: మణిపూర్‌లో పర్యటించి, అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమస్యలకు తగు పరిష్కారం చూపుతూ కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు నివేదిక అందజేస్తామని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి నేతలు ప్రకటించారు. కూటమిలోని 16 పారీ్టలకు చెందిన 20 మంది ఎంపీలు ఈ నెల 29, 30వ తేదీల్లో మణిపూర్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్‌ నుంచి ఆధిర్‌ రంజన్‌ ఛౌధురి, గౌరవ్‌ గొగోయ్, టీఎంసీ నేత సుష్మితా దేవ్, జేఎంఎంకు చెందిన మహువా మాజి, డీఎంకే కనిమొళి, ఎన్‌సీపీ నేత మహ్మద్‌ ఫైజల్, ఆర్‌ఎల్‌డీ జయంత్‌ చౌధరి, ఆర్‌జేడీ మనోజ్‌ ఝా, ఆర్‌ఎస్‌పీ ఎన్‌కే ప్రేమచంద్రన్, వీసీకే నేత తిరుమావళన్‌.

వీరితో పాటు జేడీ(యు) చీఫ్‌ రాజీవ్‌ రంజన్‌ సింగ్, జేడీ–యూకు చెందిన అనీల్‌ ప్రసాద్‌ హెగ్డే, సీపీఐ నుంచి సందేశ్‌ కుమార్, సీపీఎం నేత ఏఏ రహీం, ఎస్‌పీ నుంచి జావెద్‌ అలీఖాన్, ఐయూఎంఎల్‌ ఈటీ మహ్మద్‌ బషీర్, ఆప్‌ నేత సుశీల్‌ గుప్తా, శివసేన(యూటీ) అరి్వంద్‌ సావంత్, డీఎంకే నేత డి.రవి కుమార్, కాంగ్రెస్‌ నేతలు ఫులో దేవి నేతం, కె.సురేశ్‌ ఈ బృందంలో ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో మణిపూర్‌ హింసపై దర్యాప్తు జరిపించాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష ఉపనేత గౌరవ్‌ గొగోయ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో అంతా మంచిగానే ఉన్నట్లు చూపాలని కేంద్రం అనుకుంటోందని ఆరోపించారు.

మహిళల గౌరవంతో ఆటలా?
బీజేపీ అధికార దాహంతోమహిళల గౌరవంతో, దేశ ఆత్మగౌరవంతో ఆటలాడుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో వీడియో షేర్‌ చేశారు. మణిపూర్‌లో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా కేంద్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ, మహిళలను గౌరవించని దేశం పురోగమించదన్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)