Breaking News

ఇరాన్‌లో భారతీయులకు హైఅలర్ట్

Published on Thu, 01/15/2026 - 00:36

టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం టెహ్రాన్‌లోని భారతీయులకు అలర్ట్ జారీ చేసింది. ‘‘ఇరాన్‌లో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. భారతీయులు వెంటనే ఇరాన్‌ను వీడాలి. సురక్షిత దేశాలకు వెళ్లాలి. ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు వీలైనంత తర్వగా ఆ దేశం నుంచి బయట పడాలి’’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఈ నెల 5న జారీ చేసిన అలర్ట్‌ తో పోలిస్తే.. పరిస్థితులు మరింతగా దిగజారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనలు జరుగుతున్న ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. నిత్యం టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో టచ్‌లో ఉండాలని ఆదేశించింది. స్థానిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోవాలని పేర్కొంది.

మరోవైపు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో బుధవారం సాయంత్రం ఫోన్‌లో చర్చలు జరిపింది. కాగా.. ఇరాన్ అల్లర్లలో మరణాల సంఖ్య 12 వేలకు పెరిగినట్లు ‘ద గార్డియన్’ పత్రిక వెల్లడించింది. నిరసనకారులతోపాటు.. భద్రతాబలగాలు కూడా మృతిచెందినట్లు వివరించింది. బుధవారం సాయంత్రం 300 మృతదేహాలను టెహ్రాన్ వర్సిటీ ప్రాంగణంలో సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలను ప్రచురించింది. అయితే.. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ మాత్రం ఇప్పటి వరకు 2,550 మరణాలు నమోదైనట్లు తెలిపింది. వీరిలో 2,403 మంది నిరసనకారులు కాగా.. మిగతా 147 మంది ఐఆర్‌జీసీ, పోలీసు బలగాలకు చెందినవారని వివరించింది.

 


 

#

Tags : 1

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)