Breaking News

మోదీపై పోటీ: రామ్‌కుమార్‌ ప్రత్యేకత ఏంటంటే..

Published on Thu, 05/16/2024 - 11:23

ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసిలో ఓ వృద్ధుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాడు. ఆయన పేరు రామ్‌కుమార్‌ వైద్య. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా ఇందర్‌ఘడ్‌ వాసి. చిన్న కిరాణా దుకాణం నడుపుతుంటాడు. మోదీపై పోటీతో మాత్రమే కాదు.. నామినేషన్‌ టైంలోనూ ఆయన వార్తల్లోకి ఎక్కారు. 

వారణాసిలో పోటీ కోసం రూ.25,000 రూపాయి నాణేలు డిపాజిట్‌ చేసి నామినేషన్‌ పత్రాలు కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చురాన్‌ బుదియా అమ్ముతూ వేలల్లో నాణేలను పోగేసి వాటినే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. వాటిని చూసి వాళ్లు కంగు తిన్నారు. కిందామీదా పడి నాణేలను లెక్కించారు. 

మంగళవారం నామినేషన్‌ వేసేందుకు వైద్య 550 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ వారణాసి వచ్చాడు. ఆయనకు ప్రతిపాదకులుగా వారణాసిలోని కొందరు ఆటోడ్రైవర్లు సంతకాలు చేశారు. ఎన్నికల బరిలో దిగడం ఆయనకు ఇదేమీ కొత్త కాదు. ఇప్పటికే కౌన్సిలర్‌ నుంచి ఎమ్మెల్యే దాకా పలు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి మాత్రం బరిలో దిగుతున్న పార్లమెంట్‌ స్థానాన్ని మార్చి అందరి దృష్టినీ ఆకర్షించారు.

వారణాసి ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తేందుకే తాను అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు. ప్రధాని అయినా సరే, మోదీకి గట్టి పోటీ ఇస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తుండటం విశేషం. మిమిక్రీ సంచలనం, ప్రముఖ హాస్య కళాకారుడు శ్యామ్‌ రంగీలా కూడా వారణాసిలో మోదీపై ఇండిపెండెంట్‌గా బరిలో దిగడం తెలిసిందే. కానీ ఆయన నామినేషన్‌ బుధవారం తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్‌ నుంచి ఎప్పట్లాగే అజయ్‌ రాయ్‌ బరిలో ఉన్నారు. వారణాసిలో జూన్‌ 1న చివరి విడతలో పోలింగ్‌ జరగనుంది.
 

 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)