Breaking News

అమేథీపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్‌?

Published on Tue, 04/30/2024 - 11:12

జాతీయ కాంగ్రెస్‌లో అమేథీ అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొంది. యూపీలోని అమేథీ నుంచి ఎవరిని ఎన్నికల బరిలో నిలపాలనేదానిపై ఢిల్లీ కాంగ్రెస్‌ దర్బార్‌లో సమావేశం జరిగి 72 గంటలు గడిచినా, ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. అయితే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే.. త్వరలోనే అమేథీ అభ్యర్థిని తెలియజేస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

అమేథీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తారు. అయితే 2019లో ఈ మ్యాజిక్‌ను స్మృతి ఇరానీ బద్దలు కొట్టారు. అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు కాంగ్రెసేతర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ ఓడిపోయిన త‌ర్వాత పార్టీ ఆలోచనలో పడింది. ఇప్పుడు నామినేషన్‌కు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియక స్థానిక పార్టీ నేతలు అయోమయంలో కూరుకుపోయారు. 

అమేథీ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ కాంగ్రెస్, ఎస్పీల సమన్వయ కమిటీ  సమాలోచనలు చేస్తోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్  మాట్లాడుతూ అతి త్వరలోనే అమేథీ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందన్నారు. మే 3న రాష్ట్ర ఇన్‌చార్జి వస్తారని తెలిపారు. అప్పుడు ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందని ఆయన అన్నారు.

వయనాడ్ ఎన్నికల తర్వాత రాహుల్ అమేథీకి వచ్చే అవకాశం ఉందని గతంలో చర్చ జరిగింది.  అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా నిశ్శబ్ధం కొనసాగుతోంది. ఇదేసమయంలో ఖర్గే చేసిన ప్రకటన ఇంకేదో సూచిస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు బీజేపీపై ఆగ్రహంతో ఉన్న వరుణ్.. అమేథీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)