Breaking News

ఒడిశాలో ఐటీ దాడులు..156 సంచుల్లో డబ్బు

Published on Sat, 12/09/2023 - 05:59

భువనేశ్వర్‌/రాంచీ: ఒడిశాకు చెందిన డిస్టిలరీ గ్రూప్‌పై ఆదాయ పన్ను శాఖ అధికారులు కొనసాగిస్తున్న సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో కట్టల కొద్దీ అక్రమ నగదు బయటపడుతోంది. గురువారం బొలంగీర్‌లోని బల్దేవ్‌ సాహు అండ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో జరిపిన తనిఖీల్లో రూ.200 కోట్ల నగదు బయటపడింది. శుక్రవారం బొలంగీర్‌ జిల్లా సుదపడలో జరిపిన సోదాల్లో నిండా కరెన్సీ నోట్లున్న 156 సంచులను గుర్తించారు. వీటిలో ఏడు బ్యాగుల్లో నగదును లెక్కించగా రూ.20 కోట్లుగా తేలిందని అధికారులు తెలిపారు.

దీంతో, ఇప్పటి వరకు లభ్యమైన డబ్బు రూ.220 కోట్లకు చేరుకుందన్నారు. లిక్కర్‌ కంపెనీతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న జార్ఖండ్‌ ఎంపీ సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోందని పీటీఐ తెలిపింది. రాంచీలోని ఆయన కార్యాలయం సిబ్బంది కూడా ఎంపీ అందుబాటులో లేరని చెబుతున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు మూడు రోజులుగా డిస్టిలరీ గ్రూప్‌ సంస్థలకు చెందిన సంబల్‌పూర్, బొలంగీర్, తితిలాగఢ్, సుందర్‌గఢ్, రూర్కెలా, భువనేశ్వర్‌లలో తనిఖీలు సాగిస్తున్నారు.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)