14 రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక

Published on Mon, 11/25/2024 - 07:47

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల చలి వాతావరణం నెలకొనగా, మరికొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. కోస్తాంధ్రలో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, పలు రాష్ట్రాల్లో పొగమంచు ఆవరించే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాబోయే వారంలో దేశంలోని 14 రాష్ట్రాల్లో వాతావరణం ఎలా  ఉండబోతోందో తెలియజేసింది.

ఐఎండీ అందించిన వివరాల ప్రకారం నవంబర్ 25న నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతం శ్రీలంక తీరం వెంబడి 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నవంబర్ 26న తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 27,28 తేదీల్లో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, ఆ పక్కనే ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 25-29 మధ్య తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నవంబర్ 27-28 తేదీలలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి  వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 25న మత్స్యకారులు సముద్రతీరానికి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.

పలు రాష్ట్రాల్లో దట్టమైన  పొగమంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోని వివిధ ప్రాంతాలలో నవంబర్ 27 నుంచి 29 వరకు, హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 25 నుంచి 28 వరకు, ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 28 నుంచి 30 ఉదయం వరకు పొగమంచు కురియనుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవుల్లో చలిగాలులు వీస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)