Breaking News

ఏపీలో రుతుపవనాలకు స్వల్ప విరామం!

Published on Wed, 07/03/2024 - 07:53

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో  నైరుతి రుతుపవనాల కదలికలో స్వల్ప విరామం చోటుచేసుకుంది. జూలై 6 వరకు ఏపీలో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదు కానున్నాయి. 

నిన్న(మంగళవారం) బాపట్లలో 35.8, మచిలీపట్నంలో 35.6, తునిలో 35.5 విశాఖ ఎయిర్‌పోర్టు 34.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు( బుధవారం) కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు.

దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. నిన్న(మంగళవారం) రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల అంతట నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజుల ముందుగానే దేశం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు  వాతావరణ అధికారులు వెల్లడించారు.

 

ఈ నెల 8వ తేదీన దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందుగా జూలై 2న విస్తరించాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు రెండు మూడురోజు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. మే30వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఇక.. మరో నాలుగైదు రోజుల పాటు వాయువ్య, తూర్పు ఈశాన్య భారతంలో నైరుతి రుతుపవనాలు కదులుతాయని  వాతావరణ శాఖ పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)