Breaking News

రాబోయే రెండు నెలలు సాధారణం కంటే తక్కువ వర్షపాతమే

Published on Sat, 08/01/2026 - 05:57

న్యూఢిల్లీ:  దేశంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకు ఉండే ద్వితీయార్ధంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం నెలవారీ అంచనాలను విడుదల చేసింది. వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ)లో 94 శాతం కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది. 

ఎల్‌పీఏ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో నెల లేదా రుతువు వంటి నిర్ణిత కాలంలో నమోదైన వర్షపాతం సగటును సూచిస్తుంది. ఈ సగటును సాధారణంగా 30 నుండి 50 ఏళ్ల వంటి సుదీర్ఘ కాల వ్యవధి ఆధారంగా లెక్కిస్తారు. 1971 నుండి 2020 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా ఆగస్టు నుండి సెప్టెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతం దీర్ఘకాలిక సగటు 422.8 మిల్లీమీటర్లు.

 ఆగస్టు–సెప్టెంబర్‌ కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెటియోరాలజీ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర స్పష్టంచేశారు.

 అయితే, దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశం, వాయువ్య భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలు, తూర్పు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. జూన్, జూలై మధ్య కాలంలో 13 శాతం వర్షపాతం లోటు నమోదయ్యింది. జూన్‌ నెలాఖరు నాటికి ఈ లోటు 35.4 శాతంగా ఉంది. జూలైలో కురిసిన మంచి వర్షాల కారణంగా వర్షపాతం లోటు తగ్గిందని అని డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)