Breaking News

ముంచుకొస్తున్న 'బిపర్‌ జోయ్‌' తుఫాను..అలర్ట్‌ చేసిన వాతావరణ శాఖ!

Published on Fri, 06/09/2023 - 11:26

అరేబియా సముద్రంలో అత్యంత తీవ్రమవుతున్న బిపర్‌ జోయ్‌ తుపాను రానున్న 36 గంటల్లో మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ ట్వీట్‌ చేసింది. జూన్‌ 08 రాత్రి 11.30 గంటలకు గోవాకిమ నైరుతి దిశలో 840 కిలోమీటర్లు, ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 870 కిలోమీటర్లు, ముంబైకి నైరుతిగా 901 కిలోమీటలర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది.

నిజానికి ఈ బిపర్‌ జోయ్‌ తుపాను తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడి..నెమ్మది నెమ్మదిగా బలపడుతూ..రానున్న 36 గంటల్లో క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ట్విట్టర్‌లో తెలిపింది. ఈ తుపాను కారణంగా దక్షిణ గుజరాత్‌, సౌరాష్ట్ర సహా తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇదిలా ఉండగా ఈ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. అలాగే సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని హెచ్చరించడమే గాక జూన్‌ 14 వరకు సముద్రంలో చేపల వేటను నిలిపేయాలని కోరింది.

(చదవండి: వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో 48 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు)
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)