Breaking News

అక్రమ వాకీ-టాకీల అమ్మకాలు, ఈ కామర్స్‌ సంస్థలకు షాక్‌

Published on Fri, 01/16/2026 - 18:50

ఈ  కామర్స్‌ సంస్థలకు  ఇండియాలో భారీ షాక్‌ తగిలింది.  పెద్ద ఎత్తున వాకీ-టాకీల అక్రమ అమ్మకాలు చేపట్టాయంటూ మెటా ప్లాట్‌ఫామ్‌లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) జరిమానా విధించింది. 

సున్నితమైన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లపై పనిచేసే అనధికార రేడియో పరికరాల వల్ల ప్రజా భద్రత, జాతీయ భద్రతకు ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకాలను గుర్తించినట్టు భారతదేశ వినియోగదారుల వాచ్‌డాగ్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తెలిపింది. జనవరి 16న 16,900 కంటే ఎక్కువ నాన్-కాంప్లైంట్ వాకీ-టాకీల జాబితాలను గుర్తించిందని (వీటినే పర్సనల్ మొబైల్ రేడియోలు (PMRలు) అని కూడా పిలుస్తారు) వీటిని తప్పనిసరి ఆమోదాలు లేకుండా విక్రయిస్తున్నట్టు  గుర్తించినట్టుపేర్కొంది.  ఈ కారణంగా  అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ , మెటా,  మీషోలపై రూ. 10 లక్షల జరిమానా విధించింది. అలాగే   జియోమార్ట్, చిమియా,  టాక్ ప్రో, మాస్క్‌మ్యాన్ టాయ్స్‌లపై ఒక్కొక్కటి ఒక లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు అథారిటీ తెలిపింది. అనేక ప్లాట్‌ఫామ్‌లు జరిమానాలు చెల్లించాయని, మిగిలిన సంస్థల నుండి చెల్లింపులు వేచి ఉన్నామని తెలిపింది.

ప్రభుత్వ అనుమతులు లేకుండా వాకీ-టాకీల , ఇతర రేడియో పరికరాలు జాబితా చేయ బడకుండా లేదా విక్రయాలు జరగకకుండా చూసుకోవాలని CCPA ఆదేశించింది. ఇందుకు ఆయా సంస్థలు క్రమం తప్పకుండా స్వీయ-ఆడిట్‌లను నిర్వహించాలని, సమ్మతి ధృవీకరణ పత్రాలను ప్రచురించాలని, నియంత్రిత వైర్‌లెస్ పరికరాలు చట్టానికి పూర్తిగా అనుగుణంగా మాత్రమే విక్రయించబడుతున్నాయని నిర్ధారించుకోవాలని కూడా ఇది కోరింది. (పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనం)

భారతదేశంలో వాకీ-టాకీల అమ్మకం, దిగుమతి ,వినియోగం ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం, 1933,  ప్రకారం తక్కువ శక్తి మరియు చాలా తక్కువ శక్తి కలిగిన షార్ట్ రేంజ్ రేడియో ఫ్రీక్వెన్సీ పరికరాల వాడకం (లైసెన్సింగ్ అవసరం నుండి మినహాయింపు) నియమాలు, 2018 ప్రకారం నియంత్రించబడతాయి.

ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)