Breaking News

రామాయణంతో ఆటలా? బాంబే ఐఐటీ విద్యార్థులకు భారీ జరిమానా

Published on Thu, 06/20/2024 - 14:14

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బాంబే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)మరోమారు వార్తల్లో నిలిచింది. రామాయణంలోని కొన్ని అంశాల ఆధారంగా ఇక్కడి విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్‌ వివాదాస్పదంగా మారింది. రామాయణాన్ని అపహాస్యం చేసేవిధంగా విద్యార్థులు ఈ నాటకం వేశారంటూ పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి.

రామాయణం నాటకం పేరుతో బాంబే ఐఐటీ విద్యార్థులు సనాతన హిందూ సంప్రదాయాలను మంట గలిపారనే విమర్శలు వెల్లువెత్తాయి. రెండు నెలల క్రితం ఐఐటీ బాంబేలో ‘రాహోవన్’ పేరుతో విద్యార్థులు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ఇది విమర్శలపాలైన నేపధ్యంలో తాజాగా ఆ విద్యార్థులపై ఐఐటీ బాంబే అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ నాటకంలో వివిధ పాత్రలు పోషించిన విద్యార్థులలో ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించారు. బాంబే ఐఐటీలో ప్రతియేటా ఆర్ట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. 2024 మార్చి 31న ఈ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకల్లో కొంత మంది విద్యార్థులు ‘రాహోవన్‌ ’ అనే నాటకాన్ని ప్రదర్శించారు.

రామాయణం  ఇతివృత్తంగా ఈ నాటకాన్ని రూపొందించారు. అయితే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను వారు పోషించిన పాత్రలకు నేరుగా ఉపయోగించలేదు. అయితే రామాయణంలోని అరణ్య కాండంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలు వీరు ప్రదర్శించిన నాటకంలో ఉన్నాయి. అవి రామాయణాన్ని అపహాస్యం చేసేవిగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. వీరు వేసిన నాటకంలోని దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)