Breaking News

ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్‌ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ..

Published on Sun, 07/30/2023 - 17:57

ముంబయి: ఐఐటీ బాంబేలో ఆహార అలవాట్లపై వివక్ష చూపుతున్నారనే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. హాస్టల్ క్యాంటీన్‌లో నాన్‌వెజ్ భుజించే ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానపరిచారని ఓ స్టుడెంట్‌ తెలిపాడు. హాస్టల్ క్యాంటీన్ 12లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు. క్యాంటీన్‌లో శాఖాహారం తినే వారికి మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అంటూ పోస్టర్లు కూడా అంటించినట్లు వెల్లడించాడు. ఆ ప్రదేశాల్లో నాన్‌ వెజిటేరియన్లు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నాడు.

హాస్టల్‌లో తినే ఆహారం ఆధారంగా ఏమైనా విభజన ఉందా? అనే అంశంపై ఆర్టీఐలో సమాధానం కోరినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే.. ఈ ప్రశ్నకు ఫుడ్‌ ఆధారంగా ఎలాంటి వివక్ష లేదని యాజమాన్యం నుంచి బదులు సమాధానం కూడా వచ్చిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ విధంగా వివాదం కొనసాగుతోందని తెలిపాడు.

ఈ రకమైన వివక్ష తమకు అవమానకరమని కొంత మంది విద్యార్థులు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అంబేద్కర్‌ పెరియార్ పూలే స్టడీ సర్కిల్(ఏపీపీఎస్‌సీ) విద్యార్థులు ఈ అంశంపై స్పందించారు. ఆహారం ఆధారంగా ఎలాంటి విభజన లేదని ఆర్టీఐలో సమాధానం వచ్చినప్పటికీ కొందరు ఈ రకమైన వివక్షను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'విజిటేరియన్స్ ఓన్లీ' అనే పోస్టర్లని క్యాంటీన్ గోడలకు అంటించారని తెలిపారు. 

తాము ఉన్నత వర్గాలమని చూటుకోవడానికే కొందరు ఈ రకమైన వివక్ష చూపుతున్నారని విద్యార్థులు చెప్పారు. అట్టడుగు వర్గాల విద్యార్థులను అవమానపరచడమేనని అన్నారు. ఈ అంశంపై ఐఐటీ డైరక్టర్ నుంచి గానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నాన్‌వెజిటేరియన్ విద్యార్థులు ప్రత్యేక ప్లేట్‌లను ఉపయోగించాలనే ఘటనలు 2018లోనూ జరిగినట్లు చెప్పారు.   

ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్‌..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)