Breaking News

IIT Bombay: ఏడో అంతస్తు నుంచి దూకిన ఐఐటీ విద్యార్థి..

Published on Mon, 02/13/2023 - 10:05

ముంబై: ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఇతడు హాస్టల్ ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ఘటన జరిగింది.

గుజరాత్‌ అహ్మదాబాద్‌కు చెందిన ఈ విద్యార్థి వయసు 18 ఏళ్లు. కాలేజీలో జాయిన్ అయి మూడు నెలలే అయింది. ఫస్ట్ ఎండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా శనివారమే ముగిశాయి. ఆ మరునాడే ఇతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే ఈ విద్యార్థి ఎప్పుడూ ఒంటిరిగా ఉంటాడని, హాస్టల్ రూమ్‌మేట్‌తో కూడా సరిగా మాట్లాడట్లేదని పోలీసులు తెలిపారు. ఒంటరితనం వల్లే అతనికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే పరీక్షల ఒత్తిడి కూడా ఓ కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు..

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)