Breaking News

నెలసరి పురుషులకూ వస్తే తెలిసేది!: సుప్రీం కోర్టు

Published on Wed, 12/04/2024 - 19:21

న్యూఢిల్లీ: ఓ మహిళా జడ్జికి గర్భస్రావం అయిన పరిస్థితిని కనీస పరిగణనలోకి తీసుకోకుండా తొలగించడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు నిర్ణయాన్ని సుమోటోగా విచారణ జరుపుతోంది. అయితే..

ఆశించిన స్థాయిలో పనితీరు లేదనే కారణంతో ఆరుగురు సివిల్‌ జడ్జిలను తొలగిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు గతేడాది సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే అందులో నలుగురిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ నిర్ణయించింది. ఊరట దక్కని ఇద్దరు..  ఎంత విజ్ఞప్తి చేసినా ఉన్నత న్యాయస్థానం వినలేదు. 

అయితే.. ఓ న్యాయమూర్తి తనకు గర్భస్రావం కావడంతోపాటు తన సోదరుడు క్యాన్సర్‌ బారినపడినట్లు హైకోర్టు ధర్మాసనం ముందు వివరణ ఇచ్చినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్‌ నాగరత్న, ఎన్‌కే సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. మంగళవారం విచారణ జరిపింది.

‘‘ఆ న్యాయమూర్తికి గర్భవిచ్ఛిత్తి జరిగింది. అటువంటి మహిళ మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంది. పురుషులకూ నెలసరి వస్తే ఆ సమస్య ఏంటనేది తెలిసేది’’ అని జస్టిస్‌ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. అలాగే.. ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పనితీరు ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అటువంటి ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకూ ఉండాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. 

ఈ క్రమంలో..  సివిల్ జడ్జీల తొలగింపు విధివిధానాలపై వివరణ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్‌ 12వ తేదీకి వాయిదా వేసింది. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)