Breaking News

చారిత్రక ప్రాంతాల్లో యోగా డే

Published on Tue, 06/16/2026 - 01:50

న్యూఢిల్లీ: హరిద్వార్‌లోని గంగానది తీరం నుంచి హంపి శిథిలాలు, ఢిల్లీలోని ఎర్రకోట వరకు.. దేశవ్యాప్తంగా గల 12 చారిత్రాత్మక వేదికలు ఈ ఏడాది ’అంతర్జాతీయ యోగా దినోత్సవం’ వేడుకలకు వేదికలు కానున్నా­యి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 21న కోల్‌కతాలో ప్రధాన వేడుకలు జరగనున్నాయి. అదేసమయంలో, 12 ప్రాంతాల­లో జాతీయ స్థాయి యోగా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

 దేశ సాంస్కృతిక వారసత్వా­న్ని, యోగా విశిష్టతను చాటేందుకు కేంద్ర ఆయుష్‌ శాఖ యోగా డే నిర్వహణను ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ తెలిపారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ‘ఆరోగ్యకరమైన వృద్ధా­ప్యం కోసం యోగా’అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. శతాబ్దాలుగా చెక్కుచెదర­ని ఈ చారిత్రక కట్టడాల తరహాలోనే, యోగా కూడా మానసిక, శారీరక దృఢత్వాన్ని కలుగజేస్తూ ఎన్నో తరాలుగా సమాజానికి తోడ్పడుతోందని మంత్రి పేర్కొన్నారు. 

ఎంపిక చేసిన 12 ప్రాంతాలివే.. 
ఢిల్లీలోని ఎర్రకోట, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ హర్‌ కీ పౌరీ, ఒడిశాలో కోణార్క్‌ సూర్య దేవాలయం, కర్ణాటకలో హంపి కట్టడాలు, లద్దాఖ్‌లో లేహ్‌ ప్యాలెస్, తమిళనాడులో మ­హా­బలిపురం తీర ఆలయం, ఉత్తరప్రదేశ్‌లో సార్‌నాథ్, అసోంలో కంచరి కోట, హైదరాబాద్‌లో చార్మినార్, ముంబైలో గేట్‌వే ఆఫ్‌ ఇండి­యా, బిహార్‌లో 

నలంద మహావిహార, అహ్మదాబాద్‌లో సబర్మతీ తీరం. ప్రతీ ప్రాంతం దేశ సాంస్కృతిక ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి చెప్పారు. సార్‌నాథ్, నలంద దేశ జ్ఞాన సముపార్జన, ధ్యాన సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేవి కాగా, కోణార్క్‌ సూర్య దేవాలయం, మహాబలిపురం తీర దేవాలయం కళాత్మకత, అద్భుత నిర్మాణ కౌశలానికి శాశ్వత చిహ్నా­లుగా నిలిచాయన్నారు. హరిద్వార్‌లోని హర్‌ కీ పౌరీ, అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆధ్యాత్మికతకు ప్రతీకలు కాగా, ఎర్రకోట, చార్మినార్, గేట్‌వే ఆఫ్‌ ఇండియా, లేహ్‌ ప్యాలెస్‌లు దేశ చారిత్రక ప్రస్థానంలో కీలకమైన మైలురాళ్లను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.

 సరిహద్దులతో ప్రమేయం లేకుండా అందరినీ ఏకం చేయగల ప్రత్యేక సామర్థ్యం యోగాకు ఉందని చెప్పడమే కార్యక్రమ లక్ష్యమని మంత్రి చెప్పారు. లద్వాఖ్‌లోని హిమాలయ పర్వత సానువులు, హరిద్వార్‌లోని గంగానతీ తీరం, హంపి శిథిలాలు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ వంటి మహానగరాలు..ఇలా ఏప్రాంతమైనా తరాలను దాటి ప్రజలను అనుసంధానించే ఒక ఏకీకృత శక్తిగా యోగా నిలుస్తుందని జాదవ్‌ అన్నారు. భౌగోళికంగా, భాషాపరంగా వేరైనప్పటికీ ఈ చారిత్రక ప్రదేశాలన్నీ యోగా ద్వారా ఆరోగ్యం, సామరస్యం అనే ఒకే లక్ష్యంతో ఏకం కానున్నాయని ఆయన వివరించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)