Breaking News

ఎయిర్‌ఫోర్స్‌లో లైంగిక వేధింపులు.. వింగ్ కమాండర్‌పై కేసు

Published on Tue, 09/10/2024 - 20:33

శ్రీనగర్‌: భారత వైమానిక దళంలో సీనియర్‌ ర్యాంక్‌ అధికారిపై లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా వింగ్‌ కమాండర్‌ అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని, అత్యాచారాని పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా ఫ్లయింగ్‌ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుద్గామ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.

కాగా ఇద్దరు అధికారులు శ్రీనగర్‌ బేస్‌లోనే పనిచేస్తున్నారు. మహిళ తన ఫిర్యాదులో.. 31 డిసెంబర్ 2023న ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో సీనియర్‌ అధికారి వింగ్‌ కమాండర్‌ పీకే సెహ్రావత్‌  బహుమతి పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. బహుమతి తీసుకోమని అతని గదిలోకి పిలిచి తనతో అసహ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసినట్లు తెలిపారు. చివరికి తనను తోసేసి అక్కడి నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చారు.

ఈ ఘటన అనంతరం తనలో తానే మానసికంగా కుమిలిపోయానని.. ఎంతగానో భయపడ్డానని చెప్పారు. కానీ అతను మాత్రం ఏం జరగనట్లు సాధారణంగా వ్యహరించారని, కనీసం పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. అనంతరం  ఇద్దరు మహిళా అధికారులకు ఈ విషయం తెలియజేయగా వారి సాయంతో అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కల్నల్ స్థాయి అధికారిని ఆదేశించారని, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు తనతోపాటు వింగ్ కమాండర్  వాంగ్మూలాలు నమోదు చేయించుకున్నారని చెప్పారు.

అనంతరం వింగ్‌ కమాండర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. రెండు నెలల తర్వాత మరోసారి ఫిర్యాదు చేయగా.. అధికారులు పక్షపతంతో నిందితుడికి సహకరించారని, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవనే సాకుతో కేసును నీరుగార్చరని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని తెలిపింది.

అప్పటి నుంచి అనేక సార్లు వింగ్‌ కమాండర్‌ చేతిలో వేధింపులకు గురవుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. వీటన్నింటితో మానసిక వేధనకు గురవుతున్నట్లు, ఒకానొక సమయంలో చనిపోదామని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

నీసం సెలవులపై వెళ్లడానికి లేదా వేరే చోట పోస్టింగ్‌ కోసం అభ్యర్థించినా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని నిరంతరం భయంతో జీవిస్తున్నానని తెలిపారు. తన జీవితం మొత్తం నాశనం అయ్యిందని, పూర్తిగా నిస్సహాయకురాలిగా మారినట్లు చెప్పారు.

అయితే వింగ్‌ కమాండర్‌పై వేధింపుల ఆరోపణల వ్యహారంపై  భారత వాయుసేన స్పందించింది. ఈ కేసు గురించి తమకు సమాచారం ఉందని వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా శ్రీనగర్‌లోని భారత వైమానిక దళాన్ని బుద్గామ్‌ పోలీసులు సంప్రదించారని.. వారి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వాయుసేనకు చెందిన ఓ సీనియర్‌ అధికారి  తెలిపారు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)