Breaking News

కేదార్‌నాథ్‌లో సాగుతున్న సహాయక చర్యలు

Published on Sun, 08/04/2024 - 05:10

రుద్రప్రయాగ్‌/సిమ్లా: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన తీర్థయాత్రికుల కోసం మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేదార్‌నాథ్, భింబలి, గౌరీకుండ్‌ల్లో చిక్కుకుపోయిన మరో 1,500 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారంతా సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేసింది. 

యాత్రికులను తరలించేందుకు వైమానిక దళం చినూక్, ఎంఐ–17 హెలికాప్టర్లను శుక్రవారం రంగంలోకి దించింది. పర్వత మార్గంలో కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా పలువురు గల్లంతైనట్లు వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. శుక్రవారం లించోలిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన శుభమ్‌ కశ్యప్‌గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా గౌరీకుండ్‌–కేదార్‌నాధ్‌ ట్రెక్కింగ్‌ మార్గంలో 25 మీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. అడ్డంకులను తొలగించి, రహదారిని పునరుద్ధరించే వరకు వేచి ఉండాలని రుద్రప్రయాగ్‌ యంత్రాంగం యాత్రికులను కోరింది.

హిమాచల్‌లో ఆ 45 మంది కోసం గాలింపు
హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మండి జిల్లాల్లో వరద బీభత్సంలో గల్లంతైన 45 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. మండి జిల్లా రాజ్‌బన్‌ గ్రామంలో రాతి కింద చిక్కుకున్న వ్యక్తిని గుర్తించారు. కులు జిల్లా సమెజ్‌ గ్రామంలో గల్లంతైన పోయిన 30 మంది కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారన్నారు. శ్రీఖండ్‌ మహాదేవ్‌ ఆలయంలో చిక్కిన 300 మంది, మలానాలో చిక్కుకున్న 25 మంది పర్యాటకులు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)