Breaking News

సమర్థతను చాటాం

Published on Thu, 10/09/2025 - 06:23

హిండన్‌: తక్కువ రోజుల్లోనే సానుకూల ఫలి తాలను రాబట్టుకునేందుకు వైమానిక శక్తిని ఎంత ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చ నేది ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ప్రపంచానికి నిరూపించి చూపామని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ చెప్పారు. శత్రువు లక్ష్యాలపై గురి తప్పని దాడులు జరిపిన వైమానిక దళం దేశ ప్రజల గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుందన్నారు. హిండన్‌ వైమానిక స్థావరంలో బుధవారం జరిగిన 93వ వైమానిక దళ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. కొత్త వ్యవస్థలు, ఆయుధాలు, పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో వైమానిక దళం విజయవంతమైందన్నారు. 

రక్షణ, భద్రతలకు సంబంధించిన అంశాల్లో ఎయిర్‌ వారియర్లలో జవాబుదారీతనం పెరుగుతున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్‌ సిందూర్‌లో అసమాన పనితీరు కనబరిచిన రఫేల్‌ స్క్వాడ్రన్‌ తదితర విభాగాలకు అవార్డులను ప్రదానం చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధులై ఉండాలని ఎయిర్‌ వారియర్లకు పిలుపునిచ్చారు. పథక రచన సరికొత్తగా, ఆచరణీయంగా ఉండాలన్నారు. శిక్షణ సైతం పోరాటం మాదిరిగానే సాగాలని పిలుపునిచ్చారు.

వింటేజ్‌ ఫోర్డ్‌ కారు నడిపిన ఎయిర్‌ చీఫ్‌
హిండన్‌ వైమానిక స్థావరంలో జరిగిన భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవానికి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ 1960లనాటి ఫోర్డ్‌ కారు నడుపుకుంటూ వచ్చారు. ‘ఐఏఎఫ్‌ 1’అనే నంబర్‌ ప్లేటును కలిగిన ఈ కారు ఫోర్డ్‌ సెలూన్‌ అనే లగ్జరీ వెర్షన్‌కు చెందింది. 1969 జూన్‌ 30వ తేదీన ఐఏఎఫ్‌లో చేరిన ఈ కారు ప్రస్తుతం పాలంలోని ఎయిర్‌ ఫోర్స్‌ మ్యూజియంలో ఉంది. అరుదైన సందర్భాల్లోనే దీనికి బయటకు తీస్తుంటారు. 1969లో అప్పటి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ పీసీ లాల్‌ మొదలు 1992 వరకు ఎయిర్‌ చీఫ్స్‌ ఈ ఫోర్డ్‌ కారును వాడుకున్నారు. 1993లో అప్పటి ఎయిర్‌ చీఫ్‌ ఎన్‌సీ సూరి దీనిని మ్యూజియంకు కానుకగా అందజేశారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)