Breaking News

‘వారి కోసం జీవితాన్ని త్యాగం చేస్తా’.. జైలులో లొంగిపోయిన ఎంపీ రషీద్‌

Published on Mon, 10/28/2024 - 21:09

కశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ ‘ఇంజనీర్‌ రషీద్‌’ సోమవారం తీహార్‌ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో మధ్యంతర బెయిల్‌ గడువు నేటితో ముగియడంతో జైలులో లొంగిపోయారు. 

ఈ సందర్భంగా రషీద్‌ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని పేర్కొన్నారు. తాను కాశ్మీర్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని, శాంతి, అభివృద్ధి, ప్రజల హక్కుల పునరుద్ధరణ కోసం కృషిచేస్తానని చెప్పారు.

‘మా ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు. మాకు న్యాయం జరుగుతుంది. మేము  జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ప్రజల సంక్షేమం, కాశ్మీర్ సంక్షేమం, శాంతి గురించి , గౌరవంగా మాట్లాడుతాం. మేము లొంగిపోము. జైలు శిక్ష గురించి భయపడవద్దు. పోరాడి గెలుస్తాం. ‘మేం ఏ నేరం చేయలేదు. నేను జైలుకు వెళ్లడం గురించి చింతించను. నా ప్రజలకు దూరంగా ఉంటానన్న ఒకే ఒక భావన ఉంది’ అని అన్నారు.

అయితే తీవ్రవాద నిధుల కేసులో అరెస్టయిన అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు రషీద్, జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం సెప్టెంబర్ 10న మధ్యంతర బెయిల్ పొందారు. అనంతరం రెండుసార్లు మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన ఎంపీగా ఉన్నందున చట్టసభ సభ్యులను విచారించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కోర్టుకు అతని కేసు వెళ్లవచ్చని దనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్‌ తెలిపారు. దీనిపై ఢిల్లీ కోర్టు తన తీర్పును రిజర్వ్‌ చేసింది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)