Breaking News

Madhya Pradesh: ఐ డోంట్‌ కేర్‌.. మాజీ సీఎం వ్యాఖ్యలు

Published on Sat, 12/02/2023 - 16:00

భోపాల్: తాను ఏ ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోనని, మధ్యప్రదేశ్ ఓటర్లపై తనకు నమ్మకం ఉందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆయన స్పందించారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికం బీజేపీకే ఆధిక్యాన్ని ఇచ్చాయి. అత్యధిక సీట్లతో ఆ పార్టీనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనాలను ప్రకటించాయి. మరోవైపు కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం కాంగ్రెస్‌ గణనీయ స్థానాలు సాధిస్తుందని అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌పై కమల్‌నాథ్‌ మాట్లాడుతూ ‘నేను ఏ పోల్ (ఎగ్జిట్) గురించి పట్టించుకోను. మధ్యప్రదేశ్ ఓటర్లపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ టచ్‌లో ఉందా అనే ప్రశ్నకు బదులిస్తూ అలా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.  

ఇదిలా ఉండగా కనీసం 140 సీట్లతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇండోర్-1 నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి కైలాష్ విజయవర్గియాదే పైచేయిగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలలో వచ్చినప్పటికీ ఆయన దేశానికి బలమైన నాయకుడు అవుతాడేమో కాని తన అసెంబ్లీ నియోజకవర్గానికి కాదని, అక్కడ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్‌ జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగబోతోంది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)