Breaking News

నాకీ బిడ్డ వద్దు!

Published on Sun, 12/21/2025 - 06:16

గోరఖ్‌పూర్‌ (యూపీ): నమ్మిన భర్త నట్టేట ముంచాడన్న ఆవేదన.. అండగా ఉండాల్సిన సమయంలో మరో మహిళతో చెక్కేశాడన్న ఆగ్రహం.. ఆవేదన కలగలిసిపోయాయి. అవన్నీ ఆమెకు పుట్టిన పసికందుకు శాపంగా పరిణమించాయి. తనను మోసం చేసిన వ్యక్తి ఆనవాళ్లు బిడ్డలో ఉన్నాయి కాబట్టి.. పుట్టిన నవజాత శిశువును అంగీకరించేందుకు ఒక తల్లి నిరాకరించింది. గోరఖ్‌పూర్‌లో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలివి.

రైలు ప్రయాణంలో ప్రసవం
ఢిల్లీలో పనిమనిషిగా జీవనం సాగిస్తున్న ఒక మహిళ, నిండు గర్భిణిగా ఉన్నప్పుడు భర్త తనను వదిలేసి వెళ్లిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. రైలు ప్రయాణంలో ఉండగా పురిటి నొప్పులు రావడంతో, రైల్వే పోలీసుల సాయంతో జిల్లా ఆసుపత్రిలో చేరింది. మగబిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, భర్తపై ఉన్న కోపంతో ఆ పసివాడికి పాలివ్వడానికి కూడా ఆమె నిరాకరించింది.

కౌన్సెలింగ్‌తో కరిగిన మనసు
ఆసుపత్రి సిబ్బంది గంటల తరబడి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఆమెలో తల్లి మేలుకుంది. ‘వాడికి నా భర్త పేరు పెట్టను.. బిడ్డను నేనే పెంచుకుంటాను’.. అంటూ మనసు మార్చుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని, బిడ్డ ఆరోగ్యం మెరుగవ్వగానే డిశ్చార్జ్‌ చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జై కుమార్‌ తెలిపారు.
 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు