Breaking News

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

Published on Mon, 11/09/2026 - 10:13

న్యూఢిల్లీ: ధన్‌తేరస్‌ పండుగకు సెలవు కావాలని అడిగిన ఉద్యోగికి బాస్‌ అనుమతి నిరాకరించారు. తనకు పెయిడ్‌ లీవ్స్‌ (పీఎల్‌) ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోవడానికి కూడా అంగీకరించకపోవడంతో సదరు ఉద్యోగి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ‘రెడ్డిట్‌’లో పంచుకోవడంతో ఉద్యోగుల హక్కులు, ప్రైవేట్‌ కంపెనీల పని సంస్కృతిపై చర్చ మొదలైంది. ఆ ఉద్యోగి ఇప్పటివరకు కంపెనీలో ఒక్క పెయిడ్‌ లీవ్‌ కూడా ఉపయోగించుకోలేదని తెలిపారు. గత అక్టోబర్‌ చివరి వారంలో నాలుగు రోజులు సెలవు తీసుకోవాలనుకున్నా, పనిభారం ఎక్కువగా ఉందంటూ బాస్‌ అభ్యర్థించడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు చెప్పారు.

తనకు అప్పగించిన అసలు బాధ్యతలకు అదనంగా ఇతర విభాగాల పనులు కూడా చేస్తున్నానని, క్లయింట్లను కలవడం, సమావేశాలకు హాజరవడం వంటి పనులను ఒక్కడినే నిర్వహిస్తున్నానని వెల్లడించారు. కంపెనీ ఆదాయం పెరుగుతున్నప్పటికీ తన జీతం మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పని పూర్తయిన తర్వాత సహోద్యోగులతో మాట్లాడుతున్నా బాస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంతో తన మానసిక స్థితి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.

ఈ పోస్టుపై స్పందించిన పలువురు రెడ్డిట్‌ యూజర్లు ఉద్యోగికి సూచనలు చేశారు. సెలవులు ఉద్యోగుల హక్కు అని, హెచ్‌ఆర్‌ విభాగానికి ఫిర్యాదు చేయాలని ఒకరు సూచించారు. మరికొందరు అదనపు బాధ్యతలకు తగిన జీతం డిమాండ్‌ చేయాలని, అవసరమైతే మరో ఉద్యోగం వెతుక్కోవాలని సలహా ఇచ్చారు. 

ఇదీ చదవండి: పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)