Breaking News

టైగర్ ట్రయంఫ్ 2024: కాకినాడ బీచ్‌లో ఫీల్డ్ హాస్పిటల్

Published on Sat, 03/30/2024 - 21:27

టైగర్ ట్రయంఫ్ 2024లో భాగంగా శుక్రవారం (మార్చి 29) కాకినాడ బీచ్‌లో భారత్ & అమెరికా ద్వైపాక్షిక ట్రై-సర్వీస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (HADR) కార్యక్రమం జరిగింది. రెండు దేశాలకు చెందిన బృందాలు ఫీల్డ్ హాస్పిటల్‌ అనే ఒక ప్రత్యేక శిబిరాన్ని.. ఇల్లు వదిలిన లేదా స్థానభ్రంశం చెందిన వ్యక్తుల కోసం నిర్మించారు.
 
టైగర్ ట్రయంఫ్ 2024లో భారత్ నుంచి హెలికాప్టర్లు, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లతో కూడిన ఇండియన్ నేవీ షిప్‌లు, ఇండియన్ నేవీ ఎయిర్‌క్రాఫ్ట్, ఇండియన్ ఆర్మీ సిబ్బంది మాత్రమే కాకుండా వారికి చెందిన వాహనాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్.. హెలికాప్టర్‌లతో పాటు ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్‌లు పాల్గొన్నాయి.

యునైటెడ్ స్టేట్స్ నుంచి మెరైన్ కార్ప్స్, ఆర్మీకి చెందిన దళాలు, నౌకాదళ నౌకలు మాత్రమే కాకుండా నేవీ నుంచి ల్యాండింగ్ క్రాఫ్ట్, హోవర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు ఇందులో ప్రాతినిధ్యం వహించాయి.


 
హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఎక్సర్‌సైజ్‌లో జెన్నిఫర్ లార్సన్, కాన్సుల్ జనరల్, యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, రియర్ అడ్మిరల్ జోక్విన్ జే. మార్టినెజ్ డి పినిలోస్, రిజర్వ్ వైస్ కమాండర్ యూఎస్ సెవెంత్ ఫ్లీట్, రియర్ అడ్మిరల్ రాజేష్ ధనకర్, ఫ్లాగ్ ఆఫీసర్ మొదలైనవారు పాల్గొన్నారు. 

భారతదేశం & యునైటెడ్ స్టేట్స్ మధ్య రక్షణ సంబంధాలు బాగా పెరిగాయి. ఇప్పుడు కాకినాడలో జరుగుతున్న మూడవ టైగర్ ట్రయంఫ్ ఎక్సర్‌సైజ్‌.. ఇంతకు ముందు జరిగిన వాటితో పోలిస్తే పెద్దదని రియర్ అడ్మిరల్ మార్టినెజ్ పేర్కొన్నారు. టైగర్ ట్రయంఫ్ వంటి కార్యకలాపాలు వాస్తవ ప్రపంచంలో సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కలిసి పనిచేయగల సామర్థ్యం, విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)