Breaking News

రతన్‌ టాటా తొలి రెజ్యూమ్‌, ఎలా సిద్ధం చేశారంటే..

Published on Mon, 09/04/2023 - 08:41

155 ఏళ్ల టాటా గ్రూప్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన రతన్ టాటా ప్రపంచంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. చాలామంది మాదిరిగానే రతన్ టాటా కూడా ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన సారధ్యంలో టాటా గ్రూప్ ట్రిలియన్ డాలర్ల వ్యాపార సంస్థగా ఎదిగింది. రతన్ టాటా తొలినాళ్లలో ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ను ఎలా సిద్ధం చేశారు?  ఉద్యోగం ఎలా దక్కించుకున్నారు? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రతన్ టాటా మొదటి రెజ్యూమ్‌
అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన రతన్ టాటాకు ఐబీఎంలో ఉద్యోగం వచ్చింది. అయితే అతని గురువు, బంధువు అయిన జేఆర్‌డీ టాటాకు ఇది సంతృప్తి కలిగించలేదు. నాటి రోజులను రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు, ‘అతను(జేఆర్‌డీ టాటా) ఒక రోజు నాకు ఫోన్ చేశారు. మీరు భారతదేశంలో ఉంటూ, ఐబీఎంలోనే ఎందుకు ఉద్యోగం చేయడం?’ అని అడిగారు. దీంతో టాటా గ్రూప్‌లో ఉద్యోగం చేసేందుకు రతన్ టాటా తన రెజ్యూమ్‌ను జేఆర్‌డీ టాటాకు అందజేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో అతని వద్ద  రెజ్యూమ్‌ లేదు. వెంటనే రతన్ టాటా తాను పనిచేస్తున్న ఐబీఎం కార్యాలయంలోని ఎలక్ట్రిక్ టైప్‌రైటర్‌ సాయంతో తన రెజ్యూమ్‌ను రూపొందించారు. తాను ఐబీఎం ఆఫీస్‌లో ఉన్నానని, తనను జేఆర్‌డీ టాటా రెజ్యూమ్‌ అడిగారనే విషయం తనకు గుర్తుందని ఆయన మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తాను పనిచేస్తున్న ఆఫీసులో ఎలక్ట్రిక్ టైప్ రైటర్లు ఉండటంతో ఒక రోజు సాయంత్రం ఆ టైప్ రైటర్ సాయంతో రెజ్యూమ్‌ టైప్ చేసి అతనికి ఇచ్చానని తెలిపారు.

1962లో మొదటి ఉద్యోగం 
రెజ్యూమెను అందించిన తర్వాత రతన్ టాటాకు 1962లో టాటా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితం తర్వాత, 1991లో జేఆర్‌డీ టాటా మరణానంతరం రతన్ టాటా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలోని ప్రముఖ బిలియనీర్లలో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. నాటిరోజుల్లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడాలని రతన్‌టాటా భావించారు. అయితే తమ అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్‌ టాటా భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా?

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)