Breaking News

2023లో కశ్మీర్‌ను ఎంతమంది సందర్శించారు?

Published on Sun, 12/24/2023 - 07:00

కశ్మీర్ అనే పేరు వినగానే మన కళ్ల ముందు ఒక అందమైన ప్రదేశం కదలాడుతుంటుంది. అయితే ఇంతలోనే అక్కడ ఉగ్రవాదం నీడలు ఉన్నాయన్న వాస్తవం కూడా కళ్లముందుంటుంది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులపై ఆర్మీ సిబ్బంది చేపడుతున్న చర్యలు తీవ్రవాదాన్ని అణచివేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెలకొన్న శాంతియుత పరిస్థితుల్లో ‍కశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.

ఈ ఏడాది(2023) దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది లోయలో మెరుగైన భద్రతా పరిస్థితికి తార్కాణంగా నిలిచిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్‌లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అనడం సరైనదికాదన్నారు.

ఇదిలా ఉండగా గురువారం పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీని గురించి విలేకరులు.. జితేంద్ర సింగ్‌ను అడిగినప్పుడు అలాంటి సంఘటనలను మరువలేమని, సంబంధిత ఏజెన్సీలు వాటిని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. కాగా పర్యాటకులు తమకు కశ్మీర్‌లో తగిన భద్రత ఉందని భావించినందునే భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారని జితేంద్ర సింగ్  తెలియజేశారు. 
ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్‌ తప్పనిసరి.. ఆదేశాలు జారీ!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)