Breaking News

ఖైదీలు నెలకు ఎన్ని లేఖలు రాయవచ్చు?

Published on Sat, 03/23/2024 - 08:05

జైలు ప్రపంచం చాలా విచిత్రమైనది. చాలామంది జైళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఎవరూ జైలుకు వెళ్లాలని కలలో కూడా అనుకోరు. ఎన్‌సీఆర్‌బీ అందించిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2020’ నివేదికలోని వివరాల ప్రకారం 2020 చివరి నాటికి దేశవ్యాప్తంగా  4.83 లక్షల భారతీయ పౌరులు వివిధ జైళ్లలో ఉన్నారు. 

వీరిలో 76 శాతానికి పైగా అండర్ ట్రయల్ నిందితులు కాగా, 23 శాతం మంది దోషులుగా తేలిన వారున్నారు. ఈ అండర్ ట్రయల్ ఖైదీలు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కాగా, శిక్ష పడిన వారిలో ఎక్కువ మంది 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే ఉన్నారు.

జైళ్లలో ఖైదీల సంఖ్య ఏటా పెరుగుతోంది.  కాగా జైలులోని ఖైదీలు తమ కుటుంబాలకు నెలకు ఎన్ని ఉత్తరాలు రాయవచ్చనేది చాలామందిలో ఉండే సందేహం. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రతి 15 రోజులకోసారి లేఖ రాయవచ్చని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జైలు సూపరింటెండెంట్ వినోద్ కుమార్ తెలిపారు. 

ప్రతి ఖైదీ నెలకు రెండుసార్లు లేఖ రాయవచ్చు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీ తన కుటుంబ సభ్యులకు లేదా దగ్గరి బంధువులకు మాత్రమే లేఖలు రాయవచ్చు. దీనికి సంబంధించిన రికార్డును జైల్లో భద్రపరుస్తారు. కాగా జైలులోని ఖైదీలు లేఖలు రాసేటప్పుడు అవి జైలుకు, అక్కడి నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ఖైదీ లేఖ రాస్తే ఆ లేఖను జైలు అధికారులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)