Breaking News

Air India crash: ‘నువ్వెళ్లు.. నేను జాయిన్‌ అవుతా’.. అదే స్నేహితుని చివరి మాట..

Published on Sat, 06/14/2025 - 11:54

అహ్మదాబాద్‌: జూన్ 12 మధ్యాహ్నం రెండు గంటలు.. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం వైపు దూసుకువస్తోంది.. ఈ అకస్మాత్తు పరిణామాన్ని గ్రహించని ఇద్దరు వైద్య విద్యార్థులు మెస్‌లో అప్పుడే భోజనం ముగించారు. తన స్నేహితునికి మొబైల్ ఫోన్ ఇచ్చిన 20 ఏళ్ల ఆర్యన్.. చేతులు కడుక్కుంటూ ‘నువ్వెళ్లు.. నేను నీతో జాయిన్‌ అవుతాను’ అని అన్నాడు. ఆ స్నేహితుడు బయటకు వెళ్లిపోయాడు.

ఆర్యన్‌ చేతులు కడుక్కనే పనిలో ఉన్నాడు. ఆ క్షణంలో విమానం భవనాన్ని ఢీకొని కుప్పకూలింది. వెంటనే ఆ ప్రాంతం మరుభూమిగా మారిపోయింది. 10 నిమిషాలకు తేరుకున్న ఆ స్నేహితుడు  తన చేతిలోని ఆర్యన్ ఫోన్‌తో గ్వాలియర్‌లోని అతని బంధువులకు ఫోన్‌ చేశాడు. ‘మీరు త్వరగా రండి, ఆర్యన్ తీవ్రగాయాలతో ఐసీయూలో ఉన్నాడు’ అని చెప్పాడు. ఆర్యన్ కుటుంబ సభ్యులు అహ్మదాబాద్‌కు వెంటనే బయలుదేరారు. వారు వచ్చే సమయానికే ఆర్యన్ మృతిచెందాడు.

జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (ఫైమా) సభ్యుడు డాక్టర్ ధవల్ ఘమేటి  మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్యన్ రెండవ సంవత్సరం ఎంబీబీఎస్‌ విద్యార్థి. విమానం కూలిపోయినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలొదిలాడు. అతని మృతదేహాన్ని  కుటుంబసభ్యులకు అప్పగించారు’అని తెలిపారు. ఆర్యన్ ఎంతో తెలివైన విద్యార్థి. నీట్ కోచింగ్  తీసుకోకుండానే  ఈ పరీక్షలో 720 కి 700 స్కోర్ చేశాడు. అదికూడా మొదటి ప్రయత్నింలోనే ఈ ఘనత సాధించాడు. ఇంటర్నెట్‌లో దొరికిన స్టడీ మెటీరియల్‌ సాయంతో నీట్‌ క్రాక్‌ చేశాడు.  ఆర్యన్‌ తండ్రి రామ్‌హెట్ రాజ్‌పుత్ మాట్లాడుతూ తన చిన్న కొడుకును డాక్టర్‌గా చూడాలనే తన కల భగ్నమయ్యిందన్నారు. తన పెద్ద కుమారుడు సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్నాడని తెలిపారు.

ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై.. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)