Breaking News

Bhopal Gas Tragedy: ప్రపంచం మరువలేని విషాదమిది..

Published on Tue, 12/03/2024 - 08:45

భోపాల్: 1984, డిసెంబరు 3.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రపంచం మరువలేని విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు నేటికి 40 ఏళ్లు.. ఇన్నేళ్లు దాటినా ఈ దుర్ఘటన ఆనవాళ్లు ఈనాటికీ వెంటాడుతూనే ఉన్నాయి.

యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుంచి విషపూరిత వాయువు మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) లీక్ అయిన ఘటన భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఆ రోజు రాత్రి భోపాల్‌లోని జనం గాఢ నిద్రలో ఉండగా మృత్యువు విషవాయువు రూపంలో రెక్కలు విప్పి, లెక్కలేనంతమందిని కబళించింది. నాటి భయానక దృశ్యాలు నేటికీ చాలామంది కళ్లముందు మెదులుతుంటాయి.

ఆ రోజు ఏం జరిగింది?
భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్‌ సంస్థలో నాడు పనిచేసిన ఒక అధికారి తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘1984, డిసెంబర్ 3 మాకు ఎప్పటిలానే తెల్లారింది. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి, ఫ్యాక్టరీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాను. ఆ సమయంలో ఫ్యాక్టరీ నుండి విడుదలైన విష వాయువు నగరాన్ని కమ్మేసిందని నాకు తెలియదు. మేం బస్సు కోసం ఎదురుచూస్తుండగా  అక్కడున్న ఒక వ్యక్తి.. గ్యాస్ లీక్ అయ్యిందని, దాని వల్ల చాలా మంది చనిపోయారని చెప్పడంతో షాక్‌ అయ్యాను’ అని తెలిపారు.

సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ అనుభవంలో..
భోపాల్‌కు చెందిన సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ గోపాల్ జైన్ తన ఇంటికి వచ్చిన ఒక బంధువు చేతిపై హఠాత్తుగా వచ్చిన ఎర్రని వాపును చూసి షాక్‌ అయ్యారు. పాత భోపాల్‌ ప్రాంతమంతా పొగతో కమ్ముకుందని ఆ మహిళ  అతనికి చెప్పింది. ఉదయం హమీదియా హాస్పిటల్ చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అతనికి జరిగినదేమిటో అర్థం అయ్యింది. నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్న జైన్ మాట్లాడుతూ  ‘ఉదయం నేను ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, అక్కడి పరిస్థితి భయానకంగా ఉంది. మృతదేహాలు కుప్పలుగా  పడివున్నాయి.  అక్కడ గుమిగూడిన జనం తమవారి కోసం వెదుకుతున్నారు. యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుండి గ్యాస్ లీక్ అయిన కారణంగా ఈ దారుణం చోటు చేసుకున్నదని తెలిసింది’ అని అన్నారు.

నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ దుర్ఘటనలో 5,474 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదు లక్షల మందికి పైగా జనం గ్యాస్ విషపూరిత ప్రభావాలకు గురయ్యారు. ఈ ఘటన జరిగి నాలుగు దశాబ్దాలు గడిచినా దాని నాటి గాయం ఇంకా మానలేదు. గ్యాస్‌ లీకేజీ కారణంగా వేలాది మంది జనం అనారోగ్యం పాలయ్యారు. నాటి విషవాయువు ప్రభావం  తరతరాలుగా  వెంటాడుతూనే ఉంది. 
 

ఇది కూడా చదవండి: లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)