‘తాగుబోతులేమైనా స్వాతంత్ర్య సమరయోధులా?’

Published on Sat, 07/06/2024 - 11:14

చెన్నై: అరవై మందికిపైగా పొట్టనబెట్టుకుని కళ్లకురిచ్చి కల్తీ సారా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఒకవైపు తమిళనాట రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. మరోవైపు ఈ కేసుపై మద్రాస్‌ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది.

కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహమ్మద్‌ గౌస్‌ అనే వ్యక్తి మద్రాస్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ‘‘కల్తీసారా తాగి చనిపోయినవాళ్లు స్వాతంత్ర్య సమరయోధులేం కాదు. సామాజిక ఉద్యమకారులు అంతకన్నా కాదు. పోనీ సమాజం కోసం.. ప్రజల కోసం ప్రాణాలు వదిలారా? అంటే అదీ కాదు. కల్తీసారా తయారీ చట్టవిరుద్ధమైన చర్య అని, అలాంటప్పుడు అది తాగి చనిపోయిన వాళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు’’ అని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కల్తీసారా ఘటన.. ఆ భార్యాభర్తల మృతి తర్వాతే..!

తమ సరదా కోసమే కల్తీసారా తాగిన చనిపోయిన వాళ్లను బాధితులుగా ప్రభుత్వం పరిగణించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా అగ్ని, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో మరణించిన వాళ్లకు పరిహారం తక్కువగా  ఇచ్చిన సందర్భాల్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని, లేకుంటే న్యాయస్థానమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన.

ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్‌ జస్టిస్‌(తాత్కాలిక) ఆర్‌ మహదేవన్‌, జస్టిస్‌ మహమ్మద్‌ షాఫిక్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌.. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)