Breaking News

‘నీట్‌’లో పాస్‌.. ప్రేమలో ఫెయిల్‌.. కంటతడి పెట్టిస్తున్న పరువు హత్య

Published on Thu, 08/14/2025 - 11:25

బనస్కాంత: గుజరాత్‌కు చెందిన 18 ఏళ్ల యువతి పరువు హత్యకు గురయ్యింది. అయితే ఈ దారుణానికి కొద్దిసేపటి ముందు ఆమె తన ప్రియునికి పంపిన సందేశం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇటీవలే నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, డాక్టర్‌ కావాలనుకున్న ఆమె పరువు హత్యకు దారుణంగా బలయ్యింది.

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతిని ఆమె తండ్రి, మేనమామ కలిసి దారుణంగా హత్య చేశారు. అప్పటికే లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న ఆ యువతి తమ సంబంధం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో జీవిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆమె తన ప్రియునికి ‘రండి.. వచ్చి నన్ను తీసుకెళ్లండి. లేకపోతే నా కుటుంబ సభ్యులు నా ఇష్టానికి వ్యతిరేకంగా మరో వివాహం చేస్తారు. అందుకు నిరాకరిస్తే, నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి’ అంటూ తన ప్రియునికి సందేశం పంపింది. ఇది జరిగిన కొద్ది సేపటికే ఆమె హత్యకు గురయ్యింది.

విషయం తెలుసుకున్న మృతురాలి  ప్రియుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి తండ్రి సెంధాభాయ్ పటేల్, మేన మామ శివరాంభాయ్ పటేల్  ఈ  దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు ఆ మేనమామను  అరెస్టు చేయగా, మృతురాలి తండ్రి పరారీలో ఉన్నాడు. పోలీసుల దర్యాప్తులో ఆ యువతి శివరాంభాయ్ ఇంట్లో హత్యకు గురయ్యిందని, అక్కడే ఆమెకు నిద్రమాత్రలు కలిపిన పాలు ఇచ్చి, గొంతు కోసి చంపారని తేలింది. తరువాత నేరాన్ని కప్పిపుచ్చేందుకు అమెకు అంత్యక్రియలు నిర్వహించారని పోలీసులు తెలిపారు.

కాగా ఆమె తన ప్రియునికి చివరి సందేశం పంపినప్పుడు అతను జైలులో, వెంటనే స్పందించలేని స్థితిలో ఉన్నాడు. అయినా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే విచారణ షెడ్యూల్ అయ్యే సమయానికి ఆ  యువతి మరణించింది. జూన్ 25న కోర్టులో అతని పిటిషన్‌ విచారణకు  ఉండగా, ముందురోజు అంటే జూన్ 24న రాత్రి  ఆమె హత్యకు గురయ్యింది. ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు   ఆ మర్నాడు నిర్వహించారు. ఆ యువతి తిరిగి తన ప్రేమికునితో ఎక్కడ వెళ్లిపోతుందనే భయంతోనే ఆమె తండ్రి, మేనమామ ఈ హత్యచేశారని పోలీసులు తెలిపారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)