Breaking News

మూడేళ్లలో న్యాయం

Published on Tue, 07/02/2024 - 05:22

న్యూఢిల్లీ: సోమవారం నుంచి అమల్లోకి వచి్చన నూతన నేర చట్టాల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైన మూడేళ్లలోపు కోర్టులో న్యాయం అందేలా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. 

బ్రిటిష్‌ వలస పాలనాకాలం నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌(బీఎస్‌ఏ) చట్టాలను అమల్లోకి తెచి్చన సందర్భంగా సోమవారం ఢిల్లీలో అమిత్‌షా పత్రికా సమావేశంలో మాట్లాడారు. 

‘‘ కొత్త చట్టాల అమలుతో నేరాలు తగ్గుముఖం పడతాయి. నూతనచట్టాల కింద 90 శాతం వరకు నేరాలు నిరూపించబడి దోషులకు శిక్షలుపడతాయి. జీరో ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదులపై పోలీసుల ఆన్‌లైన్‌ రిజి్రస్టేషన్, ఎస్‌ఎంఎస్‌ తదితర విధానంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించి ఘటనాస్థలిని వీడియో తీయడం, బాధితురాలి ఇంటి వద్ద వాంగ్మూలం తీసుకోవడం వంటి ఎన్నో నిబంధనలను కొత్త చట్టాలు తీసుకొచ్చాయి’’ అని షా చెప్పారు. 

10 నిమిషాలకే కొత్త చట్టం కింద కేసు 
‘‘కొత్త చట్టాలు సోమవారం అర్ధరాత్రి అమల్లోకి వచి్చన 10 నిమిషాలకే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ సిటీలో కొత్త చట్టం కింద బైక్‌ దొంగతనం కేసు నమోదైంది. వలసపాలనాకాలంలో బ్రిటిష్‌ వాళ్లు నేరాలపై శిక్షకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మేం కొత్త చట్టాల ద్వారా న్యాయానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఈ–ఎఫ్‌ఐఆర్, జీరో ఎఫ్‌ఐఆర్, ఎలక్ట్రానిక్, డిజిటల్‌ సాక్ష్యాల ద్వారా నేరాలపై ఫిర్యాదును మరింత సులభతరం చేశాం.

 సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిన పనిలేకుండా త్వరగా న్యాయం జరిగేలా న్యాయవ్యవస్థకూ కాలపరిమితిని విధించాం. చిన్నారులు, మహిళలపై నేరాలను సున్నితమైనవిగా పరిగణించాం. కొత్త చట్టం ప్రకారం ఈ కేసుల్లో ఏడు రోజుల్లోపు దర్యాప్తు నివేదిక ఇవ్వాల్సిందే. నేర కేసుల్లో దర్యాప్తు ముగిసిన 45 రోజుల్లోపు కేసు తీర్పు చెప్పాల్సిందే. తొలిసారిగా ఒక కేసు విచారణ మొదలైన రోజు నుంచి 60 రోజుల్లోపు అభియోగాలు దాఖలుచేయాలి.

511 సెక్షన్లను 358కి కుదించాం 
ఒకేలా ఉన్న వేర్వేరు సెక్షన్లను కలిపేశాం. దీంతో 511 సెక్షన్లకు బదులు 358 సెక్షన్లు మిగిలాయి. ఉదాహరణకు 6వ సెక్షన్‌ నుంచి 52వ సెక్షన్‌లోని నిబంధనలను ఒకే సెక్షన్‌లోకి మార్చారు. న్యాయం, పారదర్శకత, నిష్పాక్షికత లక్ష్యంగా ఈ మూడు చట్టాలను తెచ్చాం’’ అని షా వివరించారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)