Breaking News

లాలూ కొడుక్కి ఓటేస్తే.. హంతకులు, కిడ్నాపర్లే మంత్రులు 

Published on Mon, 11/03/2025 - 06:22

ముజఫర్‌పూర్‌: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూప్రసాద్‌ యాదవ్‌ కొడుకు (తేజస్వీ యాదవ్‌) కోసం ఓట్లు వేస్తే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో హంతకులు, కిడ్నాపర్లు, దోపిడీరులే మంత్రులు అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ముఫరాబాద్, వైశాలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఎన్డీయేను గెలిపిస్తే వరదల నియంత్రణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

లాలూ కుటుంబంపై అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. ‘ఒకవేళ లాలూ కుమారుడు (తేజస్వీ యాదవ్‌) బిహార్‌ ముఖ్యమంత్రి అయితే.. మూడు కొత్త మంత్రిత్వ శాఖలు పుట్టుకొస్తాయి. అవే హత్యలు, కిడ్నాపులు, దోపిడీల శాఖలు. ఎన్డీయేకు ఓటు వేస్తే ఆర్జేడీ జంగిల్‌ రాజ్‌ నుంచి బిహార్‌ను కాపాడుతాం. కొత్త ముఖాలతో మళ్లీ జంగిల్‌రాజ్‌ను తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

మహాఘట్‌బంధన్‌లో సీట్ల కోసం కొట్టుకుంటుండగా, ఎన్డీయేలోని ఐదు భాగస్వామ్య పార్టీలు బిహార్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రయతి్నస్తున్నాయి. ఎన్డీయేలోని బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ (ఆర్‌వీ), హెచ్‌ఏఎం, కుశ్వాహా పార్టీలు.. పంచపాండవులు’అని షా అభివర్ణించారు. ‘లాలూ కంపెనీ, రాహుల్‌ కంపెనీ రూ.12 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి’అని ఆరోపించారు. ప్రాచీనకాలంలో లిచ్చవీ సామ్రాజ్యంలో విలసిల్లినట్లుగా వైశాలికి పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైశాలిలో 1,243 ఎకరాల్లో మెగా పారిశ్రామిక వాడను నిర్మిస్తామని, దీని ద్వారా వేలమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.  

నాడు ఉగ్రవాదులకు బిర్యానీలు పెట్టారు 
సోనియా, మన్మోహన్, లాలూ జమానాలో మనదేశంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు బిర్యానీలు తినిపించారని, మోదీ జమానాలో ఉగ్రవాదులను అంతం చేసి, వారి నివాసాలను కూల్చేస్తున్నామని అమిత్‌ షా తెలిపారు. దేశాన్ని ప్రధాని మోదీ సురక్షితంగా, సుసంపన్నంగా మార్చి అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని తెలిపారు. ముజఫర్‌పూర్‌లో రూ.20,000 కోట్లతో మెగా ఫుడ్‌పార్కును నెలకొల్పుతున్నామని చెప్పారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)