Breaking News

రన్‌వేపైనే తల‘రాతలు’

Published on Sat, 12/20/2025 - 05:09

ఆకాశమంత చదువు చదివితే ఏం లాభం.. పొట్టకూటి కోసం నేలపై కూర్చుని పరీక్ష రాయక తప్పలేదు. డిగ్రీలు, పీజీలు చేతిలో ఉన్నా.. కనీసం హోంగార్డు ఉద్యోగమైనా దొరక్కపోతుందా.. అన్న నిరాశ నిండిన నిరీక్షణ అది. ఒడిశాలోని సంబల్‌పూర్‌లో డిసెంబర్‌ 16న కనిపించిన దృశ్యం, దేశంలో నిరుద్యోగ సమస్యకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. కేవలం 187 హోంగార్డు పోస్టుల భర్తీ కోసం ఏకంగా 8,000 మంది యువత కదిలివచ్చారు. దీనికి కనీస అర్హత కేవలం 5వ తరగతి ఉత్తీర్ణత. కానీ, వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం.

 సాధారణ పరీక్ష కేంద్రాలు సరిపోకపోవడంతో, అధికారులు జమాదర్‌పాలి ఎయిర్‌స్ట్రిప్‌ (విమానాశ్రయం) రన్‌వేనే వేదికగా మార్చారు. నిరుద్యోగ యువత మండుతున్న ఎండలో, ఆకాశం కింద నేలపైనే కూర్చుని తమ భవిష్యత్తును వెతుక్కుంటూ పరీక్ష రాశారు. ఈ నియామకాలు కేవలం ఒప్పంద ప్రాతిపదికన జరుగుతున్నాయి. అయినప్పటికీ, కనీస ఉపాధి కరువైన తరుణంలో యువత వీటిపైనే ఆశలు పెట్టుకుంది. దాదాపు 10,000 మంది దరఖాస్తు చేసుకోగా, 8,000 మంది హాజరయ్యారు. ఇంతమంది కోసం 20 పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది.   

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు