Breaking News

West Bengal: హోలీ వేళ యువకుని హత్య

Published on Sat, 03/15/2025 - 07:09

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌(West Bengal)లోని ఉత్తర 24 పరగణా జిల్లాలో హోలీ వేళ దారుణం చోటుచేసుకుంది. హోలీ ఆడుతున్న 20 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పండుగపూట అందరిలో విషాదాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీటాగఢ్‌కు చెందిన ఆకాశ్‌ చౌదరి(20) ఉరఫ్‌ అమర్‌ తన ఇంటికి సమీపంలో స్నేహితులతో పాటు హోలీ(Holi) ఆడుతున్నాడు. ఇంతలో నలుగురు యువకులు అతని మెడ, శరీరంలోని ఇతర భాగాలపై కత్తితో దాడి చేశారు. వెంటనే స్థానికులు ఆకాశ్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు అతనిని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ(RG Kar Medical College)కి పంపించారు.

అక్కడి వైద్యులు ఆకాశ్‌ అప్పటికే మృతి చెందాడని నిర్థారించారు. ఈ కేసులో పోలీసులు ఆకాశ్‌పై దాడికి పాల్పడిన పవన్‌ రాజ్‌భర్‌ అనే యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఇతను గతంలో ఒక కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. ఆకాశ్‌పై దాడికి పాల్పడిన మరో ఇద్దరు పరారయ్యారు. ఆకాశ్‌ బంధువు ఒకరు మాట్లాడుతూ ఆకాశ్‌ కాలేజీలో చదువుకుంటున్నాడని, తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి పరిషత్‌ సభ్యునిగా ఉన్నాడని తెలిపారు. ఆకాశ్‌పై దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. 

ఇది కూడా చదవండి: New Zealand: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్‌ ప్రధాని

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)