Breaking News

జైలులో హెచ్‌ఐవీ కలకలం.. 63 మందికి పాజిటివ్‌

Published on Mon, 02/05/2024 - 19:14

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా జైలులోని 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ(ఎయిడ్స్‌) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్‌ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు చేరింది.

వైరస్‌ ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. హెచ్‌ఐవీ సోకిన ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఒకరు వాడిన ఇంజెక్షన్‌లతో మరొకరు డ్రగ్స్‌ ఎక్కించుకునే సమయంలో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే వీరిందరికీ ముందే హెచ్‌ఐవీ ఉందని, జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ వైరస్‌ సోకలేదని మరో వాదన వినిపిస్తోంది.

హెచ్‌ఐవీ సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఒక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హెచ్‌ఐవీ కేసులు బయటపడిన నేపథ్యంలో జైలులో వైరస్‌ మరింత  వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ఇదీచదవండి.. రిసార్ట్‌ పాలిటిక్స్‌.. తొలిసారి ఎక్కడ..ఎ‍ప్పుడంటే

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)