Breaking News

కటకటాల్లో కమ్మటి విందు!

Published on Thu, 06/05/2025 - 06:30

సోహ్రా (మేఘాలయ): మూడో నంబర్‌ లాకప్‌లో పిలుస్తున్నారు వెళ్లు... ఏడో నంబర్‌ సెల్‌లో వాళ్లకు ఏం కావాలో చూడు...యజమాని పురమాయింపులు. ఆ మేరకు కస్టమర్లకు కోరిన వంటకాలను క్షణాల మీద అందించే స్టివార్డ్‌లు. లాకప్పులేమిటి, వాటిలో కస్టమర్లు, స్టివార్డులు ఏమిటని ఆశ్చర్యపోకండి. ఇదంతా కఫేగా రూపాంతరం చెందిన ఓ పురా తన పోలీస్‌స్టేషన్‌ తాలూకు వర్ణన! మేఘాలయ లో ఈస్ట్‌ ఖాసీ హిల్స్‌లోని సోహ్రా పట్టణంలో 1885 నాటి భవనంలో ఏర్పాటైన ఈ వినూత్న కఫే టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారిపోయింది. 

ఇప్పు డు రాష్ట్రమంతటా ఎవరి నోట విన్నా దీన్ని గురించిన ముచ్చట్లే! ఈ భవనం బ్రిటిష్‌ హయాంలో నిర్బంధ కేంద్రంగా ఉండేది. స్వాతంత్య్రానంతరం పోలీస్‌స్టేషన్‌గా మారింది. రాష్ట్రంలోకెల్లా అతి పురాతన భవనం ఇదే. ఈ హెరిటేజ్‌ బిల్డింగ్‌ను చక్కని హోటల్‌గా మారిస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన నాటి డీఎస్పీ వివేక్‌కు వచ్చింది. పురాతన కట్టడం, అందులోనూ పోలీస్‌ స్టేషన్‌ కావడంతో ఆ వినూత్న వాతావరణాన్ని ఆస్వా దించేందుకు జనం విరగబడతారన్న ఆయన భావించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానితో ఏకీభవించింది.

వెంటనే పోలీస్‌స్టేషన్‌ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన కొత్త భవనంలోకి మార్చేశారు. పాత భవనంలో కఫే నిర్మాణానికి, నిర్వహణకు రెండేళ్ల కింద బిడ్లు పిలిస్తే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. భవన నిర్మాణాన్ని, పురాతన లుక్‌ను ఎక్కడా మార్చకుండా కేవలం చిన్న చిన్న మార్పులు మాత్రమే చేశారు. గోడలు, పురాతన ఫ్లోరింగ్, కటకటాలతో పాటు అన్నింటినీ వీలైనంత వరకూ యథాతథంగా ఉంచేయడం విశేషం. పోలీస్‌స్టేషన్‌గా ఉండగా వాడిన బ్రిటిష్‌ కాలం నాటి వస్తువులన్నింటినీ చక్కని అలంకరణ సామగ్రిగా మార్చేశారు. లాకప్‌లను అందమైన డైనింగ్‌ ఏరియాలుగా తీర్చిదిద్దారు. 

ఆ కాలం నాటి ఫైర్‌ప్లేస్‌ను కూడా అందమైన మరమ్మతులతో ఆకర్షణీయంగా తయారు చేశారు. అలా చూస్తుండగానే పూర్తిగా భిన్నమైన లుక్కుతో, 100 మంది సీటింగ్‌ సామర్థ్యంతో కూడిన కఫే సిద్ధమైపోయింది. దీనికి కావాల్సిన డిజైన్‌ను ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరిన ఓ యువ పారిశ్రామికవేత్తే స్వయంగా అందజేశారు! పట్టణం పేరు, కట్టడం తాలూకు పురాతనత్వం రెండూ ప్రతిఫలించేలా దీనికి ‘సోహ్రా 1885’ అని వినూత్నంగా పేరు పెట్టి మే 22న ఘనంగా ప్రారంభించారు. కటక టాల్లో కోరిన రుచులు ఆస్వాదించడమనే ఆలో చన ఆహారప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఊహించినట్టుగానే ఈ కఫేకు తొలి రోజు నుంచే విపరీతంగా పోటెత్తుతున్నారు. చూస్తుండగానే ఇది పెద్ద పర్యాటక ఆకర్షణగా కూడా మారుతోంది. అన్నట్టూ, దీనిపై వచ్చే లాభాలను పూర్తిగా పోలీసుల సంక్షేమానికే వెచ్చించనుండటం విశేషం!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)