Breaking News

సంభాల్‌లో 15 శాతానికి పడిపోయిన హిందువులు.. 1947లో ఎంతంటే?

Published on Fri, 08/29/2025 - 07:12

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన త్రిసభ్య కమిటీ తమ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇటీవల సమర్పించింది. 450 పేజీల ఈ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 2024 నవంబర్‌ 24న జరిగిన హింసతోపాటు దాని పూర్వాపరాలు వెల్లడించింది. సంభాల్‌లో హిందువుల జనాభా 15 శాతానికి పడిపోయినట్లు స్పష్టంచేసింది. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇక్కడ జనాభా స్థితిగతుల్లో భారీ మార్పులు వచ్చాయని, మత రాజకీయాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదులో సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశించడంతో పట్టణంలో గత ఏడాది హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మసీదు ప్రాంగణంలో గతంలో హిందూ ఆలయం ఉండేదని పేర్కొంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. 

సర్వే కోసం వచ్చిన బృందంతో కొందరు నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. ఇది క్రమంగా తీవ్ర ఘర్షణకు దారితీసింది. రాళ్ల దాడిలో 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. పలు వాహనాలను నిరసనకారులు దహనం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి దేవేంద్ర ఆరోరా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికలోని అంశాలివీ...

  • సంభాల్‌లో 1947 తర్వాత 15సార్లు ఘర్షణలు జరిగాయి. 1947, 1948, 1953, 1958, 1962, 1976, 1978, 1980, 1990, 1992, 1995, 2001, 2019, 2024లో హింసాకాండ చోటుచేసుకుంది.

  • దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సంభాల్‌లో హిందువులు 45 శాతం, ముస్లింలు 55 శాతం ఉండేవారు. ఇప్పుడు హిందువుల జనాభా 15 నుంచి 20 శాతానికి పడిపోయింది. ముస్లింల సంఖ్య 85 శాతానికి చేరుకుంది. తరచుగా జరుగుతున్న ఘర్షణలు, బుజ్జగింపు రాజకీయాలు ఇందుకు దోహదం చేశాయి.

  • 2024 నవంబర్‌ 22న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్‌ రెహమాన్‌ బార్క్‌ చేసిన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సంభాల్‌లో ఘర్షణ మొదలైంది. నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో ఘర్షణలు విస్తరించలేదు.  

  • అల్‌–ఖైదా, హర్కత్‌–ఉల్‌–ముజాహిదీన్‌ తది తర ఉగ్రవాద సంస్థలకు సంభాల్‌లో గతంలో స్థావరాలు ఉండేవి. ఇక్కడ ఆక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాల ముఠాలకు కొదవలేదు.  

  • సంభాల్‌లో 68 పుణ్యక్షేత్రాలు, 19 పవిత్ర బావులు ఉండేవి. అవి చాలావరకు ఆక్రమణకు గురయ్యాయి.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)