Breaking News

Hindi Day: హిందీ అధికారిక భాష ఎలా అయ్యింది?

Published on Sat, 09/14/2024 - 10:20

న్యూఢిల్లీ: నేడు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే, అర్థం చేసుకునే భాషలలో హిందీ ఒకటి. హిందీ ప్రజల భాష అని మహాత్మా గాంధీ అభివర్ణించారు. అలాగే దానిని దేశ జాతీయ భాషగా చేయాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. 1949, సెప్టెంబర్ 14న హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు. అందుకే ఈ రోజు(సెప్టెంబర్‌ 14)ను హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు. రాజ్యాంగ సభ ఆంగ్లంతో పాటు దేవనాగరి లిపిలో ఉన్న హిందీని అధికార భాషగా ఆమోదించింది. మొదటి హిందీ దినోత్సవాన్ని 1953 సెప్టెంబర్ 14న జరుపుకున్నారు. దీనిపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది.

మనదేశంలోని చాలామంది ప్రజలు హిందీని జాతీయ భాషగా భావిస్తారు. నిజానికి హిందీ జాతీయ భాష కాదు. ఈ అంశంపై వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, హిందీ మాట్లాడే రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. నిజానికి భారత రాజ్యాంగంలో ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాజ్యాంగ పరిషత్‌లో భాషపై చర్చ జరిగింది. ఆ సమయంలో హిందీని జాతీయ భాషగా చేయాలని కొంత మంది కోరగా, మరికొందరు దీనిని వ్యతిరేకించారు.

రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత హిందీని అధికార భాషగా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీని తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం దేవనాగరి లిపి రూపంలో హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు. 1949, సెప్టెంబర్ 14న రాజ్యాంగ సభ హిందీకి అధికార భాష హోదాను ఇచ్చింది. అధికారిక భాషకు జాతీయ భాషకు మధ్య వ్యత్యాసం  ఉంది. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలను తెలియజేసేందుకు ఉపయోగించేది జాతీయ భాష. ప్రభుత్వం తన అధికారిక పనుల కోసం ఉపయోగించేది అధికారిక భాష అవుతుంది. జాతీయ న్యాయస్థానం, పార్లమెంట్ లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం హిందీని అధికారికంగా వినియోగిస్తుంటారు. 

ఇది కూడా చదవండి: ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ?
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)