Breaking News

సీఎం ‘గంగ్నమ్’ స్టెప్స్.. మంత్రుల ఊగుటుయ్యాల..!

Published on Mon, 10/26/2026 - 10:50

డిస్పూర్‌: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, ఆయన కేబినెట్ మంత్రులకు సంబంధించిన ఒక వినూత్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. రాజకీయ నాయకులను ఎప్పుడూ సీరియస్‌గా చూసే ప్రజలకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)సృష్టించిన సంచలన వీడియో సరికొత్త వినోదాన్ని పంచుతోంది.

ఈ వీడియోలో సీఎం హిమంత బిస్వ శర్మతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులంతా కలిసి సౌత్ కొరియన్ ప్రముఖ గాయకుడు పీఎస్‌వై పాడిన  ‘గంగ్నమ్ స్టైల్’ పాటకు డ్యాన్స్ చేయడం విశేషం. ఈ పాటలోని అత్యంత పాపులర్ అయిన హార్స్-రైడింగ్ (గుర్రంపై కూర్చున్నట్లుగా చేసే) సిగ్నేచర్ స్టెప్పులను నాయకులు వేస్తున్నట్లుగా ఏఐ ద్వారా తీర్చిదిద్దారు.
 

అసలు నిజ జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రముఖ రాజకీయ నాయకులు ఇలా పాశ్చాత్య పాప్ సాంగ్‌కు చిందులు వేయడం సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సరదా క్లిప్‌ సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ అయి లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఒక దశాబ్దం క్రితం ప్రపంచాన్ని ఊపేసిన 'గంగ్నమ్ స్టైల్' పాట విభిన్న నృత్యరీతులతో యూట్యూబ్‌లో ఏకంగా ఒక బిలియన్ వ్యూస్ సాధించిన తొలి వీడియోగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నాటి ఆ గ్లోబల్ సెన్సేషన్‌ను ఇప్పుడు ఏఐ టెక్నాలజీ సహాయంతో మన దేశంలోని నాయకులకు అపాదించి సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. విభిన్నమైన కంటెంట్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ముందుండే ఇలాంటి సృజనాత్మక ప్రయోగాలు రాబోయే రోజుల్లో నెటిజన్లను మరింతగా అలరించడం ఖాయమని ఈ వైరల్ వీడియో మరోసారి నిరూపించింది.

ఇదీ చదవండి: ఏఐతో చావు నాటకం.. మేకను చంపి తప్పించుకున్న హంతకుడు! 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)