Breaking News

టమాటాలకు పోలీసు బందోబస్తు

Published on Sat, 10/19/2024 - 12:31

పట్నా: ఉత్తరప్రదేశ్‌లోని ఒక వింత దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న టమోటాలకు పోలీసు సిబ్బంది కాపలాగా నిలుచున్న ఆ దృశ్యం అందరినీ ఆలోచింపజేస్తోంది. టమాటాలు రోడ్డున పడ్డాయన్న సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల వారు వాటిని ఎత్తుకెళ్లేందుకు హైవేపైకి  గుంపులుగా చేరుకున్నారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని తరిమికొట్టడంతో వారంతా మౌనంగా వెనుదిరిగారు.

వివరాల్లోకి వెళితే ఒక లారీలో 1,800 కిలోల టమోటాలను ఢిల్లీకి తరలిస్తుండగా దారిలో ఆ లారీ ప్రమాదానికి గురైంది. దీంతో లారీలోని టమాటాలన్నీ రోడ్డుపై  చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే సదరు టమాటాల యజమాని టమాటాల భద్రత కోసం పోలీసులకు సమాచారం అందించారు. అర్జున్ అనే వ్యక్తి ఈ లారీని బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకువెళుతున్నాడు.

ఝాన్సీ-గ్వాలియర్ హైవేలోని సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 12 గంటల సమయంలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ వెనుకే  స్కూటీపై వస్తున్న ఒక మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.  టమాటాలు ఎవరూ ఎత్తుకెళ్లకుండా చూసేందుకు ముగ్గురు పోలీసులు ఘటనా స్థలంలో కాపలాగా నిలిచారు. ఉదయాన్నే క్రేన్ రాగానే, లారీని సరిచేసి మళ్లీ టమాటాలను లారీలోకి ఎక్కించారు. అంత వరకూ పోలీసులు అక్కడే కాపలాగా ఉన్నారు. ప్రస్తుతం టమోటాల ధర మార్కెట్‌లో కిలో రూ.80 నుంచి రూ.120 వరకు  ఉంది. పలు చోట్ల భారీ వర్షాలకు టమాటా పంట నాశనమైంది. దీంతో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

 


ఇది కూడా చదవండి: గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)