Breaking News

వైఎస్‌ జగన్‌ హయాంలోనే అత్యధిక ఇళ్లు

Published on Tue, 07/28/2026 - 05:04

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)–అర్బన్, పీఎంఏవై–అర్బన్‌ 2.0 పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు మొత్తం 19,67,971 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి తోఖన్‌ సాహు తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీనేత, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా 2015 జూన్‌ 25 నుంచి అమలవుతున్న పీఎంఏవై–అర్బన్‌ పథకాన్ని 2024 సెపె్టంబర్‌ 1 నుంచి పీఎంఏవై–అర్బన్‌ 2.0గా విస్తరించినట్లు చెప్పారు. 

ఈ పథకాల కింద ఏపీకి మంజూరైన 19.68 లక్షల ఇళ్లల్లో ఇప్పటివరకు 11.38 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, వీటిలో 10.75 లక్షల ఇళ్లల్లో లబ్ధిదారులు నివాసం ఉంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదలలో జాప్యం, మౌలిక వసతుల కల్పన ఆలస్యం, లబ్దిదారులు తమ వాటా నిధులు సమకూర్చుకోవడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా అమలు వేగం తగ్గిందని చెప్పారు.  

పీఎంఏవై–అర్బన్‌ 2.0 కింద 61,084 ఇళ్లు 
2024 సెప్టెంబర్ 1 నుంచి పీఎంఏవై–అర్బన్‌ 2.0గా విస్తరించిన ఈ పథకం కింద ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు 61,084 ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. అమరావతి భూసమీకరణ రైతులను పీఎంఏవై–అర్బన్‌ 2.0 లబ్ధిదారులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని చెప్పారు.  

వైఎస్సార్‌సీపీ హయాంలోనే అత్యధిక ఇళ్ల మంజూరు, నిర్మాణం  
వైఎస్సార్‌సీపీ హయాంలోనే అత్యధికంగా ఇళ్లు మంజూరై, నిర్మాణం జరిగినట్లు కేంద్ర గణాంకాల ద్వారా వెల్లడైంది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ పాలన కాలంలో మొత్తం 14,15,800 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పథకాల కింద చంద్రబాబు పాలనలో 2015–19 మధ్య 4,91,087 లక్షల ఇళ్లు, 2024–27 (ప్రస్తుత సంవత్సరం) 61,578 మంజూరయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వాల హయాంలో మొత్తం 5,52,171 లక్షల ఇళ్లకు ఆమోదం లభించినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)