Breaking News

శబరిమలలో మళ్లీ పెరిగిన రద్దీ

Published on Wed, 11/26/2025 - 16:05

పథనంతిట్ట: శబరిమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. వారం క్రితం మాదిరిగా.. శబరిమల సన్నిధానంలో ఇసుకేస్తే రాలనంతగా అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. దీంతో.. అయ్యప్ప స్వామి దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోంది. మండల పూజ సీజన్‌లో భాగంగా ఈ నెల 16న శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా.. తొలి నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. వారం రోజుల్లో ఆరున్నర లక్షల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కోళిక్కోడ్‌కు చెందిన ఓ వృద్ధురాలు రద్దీ కారణంగా శరణ్‌గుత్తి వద్ద మృతిచెందడంతో.. కేరళ హైకోర్టు కల్పించుకుంది. రోజువారీ స్పాట్ బుకింగ్‌లను  ఐదు వేలకు పరిమితం చేసింది.

భక్తుల దర్శనానికి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) కోర్టుకు చెప్పడంతో.. శనివారం నాటి విచారణ సందర్భంగా స్పాట్ బుకింగ్‌లపై విధించిన ఆంక్షలను తొలగించింది. దీంతో.. ఆదివారం నుంచి స్పాట్ బుకింగ్‌లు పెరిగాయి. నిజానికి రోజుకు 70 వేల మంది భక్తులు దర్శించుకునేలా ఆన్‌లైన్ స్లాట్లు విడుదలవ్వగా.. మండల సీజన్‌తో పాటు.. మకరవిళక్కు వరకు కూడా స్లాట్లు బుక్ అయిపోయాయి. దీంతో.. స్పాట్ బుకింగ్‌కు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా బుధవారం ఉదయం నుంచి శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది.

 పంపాబేస్ నుంచే భక్తులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంపా వద్ద రద్దీ సాధారణంగా కనిపించినా.. 4 గంటల నుంచి పెరుగుతూ వచ్చింది. దీని ప్రభావం మధ్యాహ్నానికి నీలిమల, శరణ్‌గుత్తి ప్రాంతాల్లో కనిపించింది. నిటారు కొండపై భక్తులు గంటల కొద్దీ వేచిచూసిన దృశ్యాలను ‘సాక్షి డిజిటల్’ యూట్యూబ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రచురించింది. నడపండాల్ క్యూలైన్లలో కూడా భక్తులు వందల సంఖ్యలో వేచిచూసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భక్తులు శరణ్‌గుత్తి నుంచి సన్నిధానం చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతోంది. నడపండాల్ నుంచి 18 మెట్లను ఎక్కడానికి మరో అరగంట.. అక్కడి నుంచి ఫ్లైఓవర్ మీదుగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఇంకో అరగంట పడుతోందని శబరిమల యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన భక్తులు ‘సాక్షి’కి వివరించారు. 

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)