Breaking News

Uttarkashi tunnel collapse: నెమ్మదించిన రెస్క్యూ ఆపరేషన్‌

Published on Thu, 11/16/2023 - 05:57

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్‌ మార్గంలో సొరంగం కుప్పకూలి నాలుగు రోజులుగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకోసం మరో భారీ యంత్రాన్ని తెప్పించారు. మూడు విడిభాగాలుగా యుద్ధవిమానాల్లో తరలించిన ఈ యంత్రాన్ని అసెంబుల్‌ చేసి, మరికొద్ది గంటల్లో డ్రిల్లింగ్‌ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

కుప్పకూలిన టన్నెల్‌ శిథిలాల గుండా ఆగర్‌ మెషీన్‌ సాయంతో వెడల్పాటి స్టీల్‌ పైపులను లోపలికి పంపే పనులు అధికారులు మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. 800, 900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్‌ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్‌ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో పనులకు అంతరాయం ఏర్పడింది.

రంగంలోకి అమెరికన్‌ ఆగర్‌
అధికారులు హుటాహుటిన భారీ అమెరికన్‌ ఆగర్‌ డ్రిల్లింగ్‌ మిషన్‌ భాగాలను భారత వాయుసేన విమానాల ద్వారా 30 కిలోమీటర్ల దగ్గర్లోని చిన్యాలిసౌర్‌కు తెప్పించారు. అక్కడి నుంచి ఘటనాస్థలికి రోడ్డు మార్గంలో తీసుకువస్తున్నామని ఎస్‌పీ అర్పణ్‌ తెలిపారు. వీటిని అసెంబ్లింగ్‌ చేసి, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు థాయ్‌లాండ్, నార్వే నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు నేషనల్‌ హైవేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌(ఎన్‌హెచ్‌ఐడి) డైరెక్టర్‌ అన్షు మాలిక్‌ తెలిపారు. 2018లో థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్‌ జట్టు జూనియర్‌ ఆటగాళ్లను అక్కడి సంస్థ నిపుణులు వారం పాటు శ్రమించి సురక్షితంగా తీసుకువచి్చన విషయం తెలిసిందే.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)