Breaking News

ఢిల్లీలో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

Published on Tue, 06/11/2024 - 11:36

ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలోని పలు జిల్లాల్లో  అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

రానున్న రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. నజాఫ్‌గఢ్‌లో ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలకు చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరుసగా రెండవ రోజు కూడా వేడిగాలులు వీస్తున్నాయి.

రానున్న రోజుల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, పగటిపూట ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గంటకు 25 నుండి 35 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాల ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)