Breaking News

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బతో ముగ్గురి మృతి 

Published on Mon, 05/15/2023 - 12:21

సాక్షి ముంబై: తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల దేశంలోని అన్ని ప్రాంతాలు ఉడికిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. విదర్భ, మరాఠ్వాడాలో 20 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా వడగాడ్పులు వీస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వీరిలో జల్‌గావ్‌ జిల్లాలోని రావేర్‌లోని నమ్రతా చౌదరి, అమల్‌నేర్‌లోని రూపాలి రాజ్‌పుత్‌ ఉండగా.. నాందేడ్‌ జిల్లాలోని విశాల్‌ మాదస్‌వార్‌ ఉన్నారు. ఈ ముగ్గురు వడదెబ్బతోనే మృతి చెందినట్లు సంబంధిత డాక్టర్లు తెలిపారు. ఈ వార్త భయాందోళనతోపాటు విషాదాన్ని నింపింది. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.  
చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ..

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)